ఏపీలో వాలంటీర్ల (AP Volunteers) దారుణాలు ఆగడం లేదు..హత్యలు , అత్యాచారాలు , దోపిడీలు చేస్తూ నానా బీబత్సం చేస్తూనే ఉన్నారు. ఓ పక్క ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఎంత చెప్పిన ప్రభుత్వం కానీ , పోలీసులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఎన్నో దారుణాలు జరుగగా..తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో తన భార్య తో వాలంటీర్ (Volunteer) పెట్టుకున్న అక్రమ సంబంధం (Illegal Affair) తట్టుకోలేక సదరు భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే..
దొరసానిపల్లె (Dorasanipalli) గ్రామంలో శివశంకర్ రెడ్డి (Shivashankar Reddy) మహిళా సంరక్షణ అధికారిగా పనిచేస్తున్నాడు.శివశంకర్ రెడ్డి భార్య ప్రేమలీల (Premaleela).. వాలంటీర్ పబ్బతి శ్రీను (Srinu) తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని భర్త శివశంకర్ రెడ్డికి తెలియడంతో భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. రోజు రోజుకు భర్త నుండి వేదింపులు ఎక్కువై పోతున్నాయని..ఇతడు ఉంటె మనకు ఇబ్బంది అని ప్రేమలీల – శ్రీను లు భావించి ఎలాగైనా ఆయన అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రియుడితో కలిసి భార్య వేసిన మర్డర్ ప్లాన్‌ను శివశంకర్ రెడ్డి పసిగట్టాడు. అయితే దసరా రోజున శివశంకర్ రెడ్డిని వాలంటీర్ పబ్బతి శ్రీను, తన స్నేహితుడు రాజాతో కలిసి బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన శివశంకర్ రెడ్డి ఇంటికి వచ్చి సూసైడ్ నోట్ రాశాడు. తన ఆత్మహత్యకు భార్య, ఆమె ప్రియుడు వాలంటీర్ పబ్బతి శ్రీను, స్నేహితుడు రాజా అని రాసి, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు శివశంకర్ రెడ్డి భార్య ప్రేమలీల, పబ్బతి శ్రీను, రాజాలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Read Also : CBN – Not Before Me : ‘నాట్ బిఫోర్ మీ’ అన్న న్యాయమూర్తి.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా