Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `క‌ల్వ‌కుంట్ల‌`తో అంతే.!

ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ (Vizag Steel) అంశాన్ని లేవ‌నెత్తారు.

  • Written By:
  • Updated On - April 13, 2023 / 05:07 PM IST

ఫ‌క్తు రాజ‌కీయాలు చేయ‌డంలో క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ రూటేవేరు. ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ (Vizag Steel) అంశాన్ని లేవ‌నెత్తారు. వ్య‌తిరేకిస్తున్నామ‌ని బాహాటంగా రెండు రోజుల నుంచి ప్ర‌క‌టిస్తూ(KTR) వ‌చ్చారు. అంతేకాదు, ఏపీలోని అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను త‌ప్పుబ‌ట్టారు. సీన్ క‌ట్ చేస్తే, విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ ను ఆపేశామ‌ని ప్ర‌క‌టిస్తూ జ‌బ్బ‌లు చ‌రుస్తున్నారు. అంటే, ప్రైవేటీక‌ర‌ణ‌పై కేంద్రం వెన‌క్కు త‌గ్గింద‌ని ముందే బీఆర్ఎస్ కు తెలుసా? అందుకే, బాహాటంగా కామెంట్ల చేస్తూ ముందుకొచ్చిందా? అంటే ఔన‌నే వాళ్లు లేక‌పోలేదు. ఇదంతా కేసీఆర్ స‌ర్కార్ క్రెడిట్ అంటూ డ‌బ్బా కొట్టుకోవ‌డం ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ.

ఫ‌క్తు రాజ‌కీయాలు చేయ‌డంలో క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీ రూటేవేరు(Vizag Steel)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel) విషయంలో కేంద్రం వెనకడుగు వేసిందని తెలంగాణ మంత్రి కేటీఆర్(KTR) ప్ర‌క‌టించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు చెప్ప‌డంతో కేంద్రం భ‌య‌ప‌డింద‌ని కేటీఆర్ చెప్పే మాట‌. అందుకే కేంద్రం వెనకడుగు వేసిందని అంటున్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడింది కేసీఆరేనని చెబుతూ, తాము తెగించి పోరాడాం కనుకనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకణపై కేంద్రం తోక‌ముడిచింద‌ని కేటీఆర్ వెల్ల‌డించారు. కేసీఆర్ దెబ్బ అంటే ఇలాగే ఉంటుందని జ‌బ్బ‌లు చ‌రుసుకుంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై అధ్యయనం చేసేందుకు సింగరేణి నుంచి నిపుణుల బృందాన్ని పంపుతామని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఈరోజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాంట్ పూర్తి స్థాయిలో పని చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన ప్ర‌క‌టించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రస్తుతానికి  లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel) విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక ప్రకటన ఎవ‌రికి అనుకూలంగా వాళ్లు మ‌లుచుకుంటున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్‌ కులస్తే గురువారం వెల్లడించారు. ఉదయం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆయన సందర్శించారు. ఆ సంద‌ర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ముందు అర్ఐఎన్ఎల్ (రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్) ను బలోపేతం చేసే పనిలో మేం ఉన్నాం. ప్లాంట్ లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నాం. పూర్తి స్థాయి సామర్ధ్యం మేరకు ప్లాంట్ పని చేసే ప్రక్రియ జరుగుతోంది. అర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తాం’’ అని వెల్ల‌డించారు.

బీఆర్ఎస్ లీడ‌ర్లు క్రెడిట్ ను పొంద‌డానికి ప్ర‌య‌త్నం

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ(Vizag Steel) చేస్తూ బిడ్ వేసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపుతున్న విషయంపై ఫగ్గన్ సింగ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం అనేది ఒక ఎత్తుగడ మాత్రమేనంటూ వ్యాఖ్యానించారు. స్టీల్‌ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని, ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని వివరించారు. ప్ర‌స్తుతానికి ప్రైవేటు ప‌రంగా చేసేది లేద‌ని ఆయ‌న చెప్ప‌గానే బీఆర్ఎస్ లీడ‌ర్లు(KTR) బ‌య‌ట‌కొచ్చారు. ఆ క్రెడిట్ ను పొంద‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Also Read : KCR on Vizag Steel Plant: విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్

కేసీఆర్ దెబ్బంటే అలా ఉంట‌ది అంటూ మంత్రి కేటీఆర్(KTR) చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. ప్రైవేటీక‌ర‌ణ అంశం చాలా కాలంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌లుగుతోంది. ఉభ‌య క‌మ్యూనిస్ట్ లు, కార్మికులు ధ‌ర్నాలు చేస్తున్నారు. ఏపీ హ‌క్కు విశాఖ ఉక్కు అంటూ నిన‌దిస్తున్నారు. వాళ్ల‌కు ఏపీలోని పార్టీల‌న్నీ సంఘీభావాన్ని ప్ర‌క‌టించాయి. ఒక వేళ ప్రైవేటీక‌ర‌ణ‌కు మొండిగా కేంద్రం వెళితే బిడ్డింగ్ లో పాల్గొంటామ‌ని గ‌తంలోనే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చెప్పారు. ఇవ‌న్నీ ప‌క్క‌న పెట్టి కేసీఆర్ పోరాటం చేస్తాడ‌ని భ‌య‌ప‌డి కేంద్రం ప్ర‌స్తుతానికి వెన‌క్కు త‌గ్గింద‌ని కేటీఆర్ చెబుతున్నారు. ఇంత‌కంటే మ‌రో రాజ‌కీయ ఎత్తుగ‌డ మ‌రొక‌టి ఉండ‌ద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. పార్ల‌మెంట్లో లేకుండానే తెలంగాణ బిల్లును పాస్ చేయించిన‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు క‌ల్వ‌కుంట్ల కుటుంబం క్రెడిట్ ను పొందుతోంది. రాజ‌కీయ న‌ష్టాన్ని కూడా ప‌క్క‌న పెట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం బ‌ల‌హీన‌ప‌డింది. ఇదే కేసీఆర్ రాజ‌కీయ గేమంటే, ఆయ‌న‌తో అలాగే ఉంటుంది. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ (Vizag Steel) విష‌యంలోనూ అంతే.!

Also Read : Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!