Vizag Steel : BRS ఎత్తుగ‌డలో ల‌క్ష్మీనారాయ‌ణ

విశాఖ స్టీల్ (Vizag steel) ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ బిడ్ వేస్తే పాల్గొనేంత ఆర్థిక స్తోమ‌త వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఉందా?

  • Written By:
  • Publish Date - April 15, 2023 / 05:02 PM IST

జ‌న‌సేన మాజీ లీడ‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ ఏ పార్టీలోకి వెళుతున్నారు? ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దిగుతారా? జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఎందుకు ప్ర‌శంసిస్తున్నారు? బీఆర్ఎస్ ను ఎత్తుకు ఆకాశానికి ఎత్తుతున్నారు? విశాఖ స్టీల్ (Vizag steel) ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ బిడ్ వేస్తే పాల్గొనేంత ఆర్థిక స్తోమ‌త ఆయ‌న‌కు ఉందా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఇప్పుడు ఆయ‌న వైపు మ‌ళ్లాయి. ఎందుకంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ బిడ్ లో పాల్గొంటామంటూ బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌, సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన వెంట‌నే వాళ్ల‌కు ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshmi naranyana) వ‌త్తాసు ప‌లికారు. ఏపీలోని పార్టీల కంటే బీఆర్ఎస్ మేల‌ని కితాబు ఇచ్చారు. దీంతో ఆయ‌న బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నార‌ని బీజేపీ నేత‌లు మీడియా ముందు అభిప్రాయాల‌ను వ్య‌క్త‌ప‌రిచారు.

జ‌న‌సేన మాజీ లీడ‌ర్ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ (Vizag Steel)

వాస్త‌వంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ (Vizag Steel) బిడ్ అనే మాట లేదు. మూల‌ధ‌నం పెంచుకోవ‌డానికి ఉత్ప‌త్తి అయిన స్టీల్ కోసం బిడ్ వేయాల‌ని ప్ర‌య‌త్నం జ‌రిగింది. దాన్ని ప్రైవేటీక‌ర‌ణ బిడ్ గా బీఆర్ఎస్ ప్ర‌చారం చేసి రాజ‌కీయ ల‌బ్ది పొందాల‌ని భావించింది. ఆ నిజాన్ని తెలుసుకోలేని వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ (Lakshmi narayana)బీఆర్ఎస్ పార్టీ ఏపీకి న్యాయం చేస్తోందంటూ మీడియాకు ఎక్కారు. ఆ త‌రువాత నిదానంగా నిజాల‌ను తెలుసుకున్న ఆయ‌న ఒక వేళ ప్రైవేటీక‌ర‌ణ కోసం బిడ్ వేస్తే తాను పాల్గొంటానంటూ వ్యాఖ్య‌నించ‌డం ద్వారా మ‌రింత ఇర‌కాటంలో ప‌డిపోయారు. దీంతో ఆయ‌న ఆస్తులు, అంత‌స్తుల మీద ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లింది.

ఐపీఎస్ అధికారిగా మంచిపేరు సంపాదించుకున్న ల‌క్ష్మీనారాయ‌ణ

ఒక ఐపీఎస్ అధికారిగా ఉంటూ మంచిపేరు సంపాదించుకున్న ల‌క్ష్మీనారాయ‌ణ(Lakshmi narayana) ఇప్పుడు రాజ‌కీయ టార్గెట్ అయ్యారు. ప్ర‌స్తుతం ఏపీ సీఎంగా ఉన్న జ‌గన్మోహ‌న్ రెడ్డి ఆస్తుల కేసుల‌ను సీబీఐ డైరెక్ట‌ర్ గా ఉన్న‌ప్పుడు ల‌క్ష్మీనారాయ‌ణ విచారించారు. ఫ‌లితంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక హీరోగా చాలా మందికి ప‌రిచ‌యం అయ్యారు. మీడియా కూడా జ‌గ‌న్ ఆస్తుల కేసును ఎప్ప‌టిక‌ప్పుడు ఫోక‌స్ చేసింది. దీంతో ల‌క్ష్మీనారాయ‌ణ‌కు కూడా అనూహ్య క్రేజ్ ల‌భించింది. ఆ క్రేజ్ తో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ల‌క్ష్మీనారాయ‌ణ భావించారు. గ‌త ఎన్నిక‌లకు ముందుగా రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నారు. బీజేపీ, టీడీపీ పార్టీల్లో చేర‌తార‌ని అప్ప‌ట్లో బాగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆయ‌న. జ‌న‌సేన పార్టీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ నాన్ సీరియ‌స్ పొలిటియ‌న్ గా భావిస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

వైసీపీలోకి  ల‌క్ష్మీనారాయ‌ణ వెళ‌తార‌ని ప్ర‌చారం

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆత్మ‌విశ్వాసం, కమిట్మెంట్ గురించి ఇటీవ‌ల ప‌లు వేదిక‌ల‌పై ల‌క్ష్మీనారాయ‌ణ (lakshmi narayana) ప్ర‌శంసించారు. దీంతో ఆయ‌న వైసీపీలోకి వెళ‌తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ఆ పార్టీ నుంచి పెద్ద‌గా సానుకూల స్పంద‌న రాలేద‌ని తెలుస్తోంది. అందుకే, తిరిగి జ‌న‌సేన‌లోకి వెళ‌తార‌ని మ‌రో టాక్ న‌డిచింది. అక్క‌డ కూడా పెద్ద‌గా సానుకూల స్పంద‌న ప‌వ‌న్ నుంచి రాలేద‌ని వినికిడి. అందుకే, ఒంట‌రిగా పోటీ చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నాన‌ని ఇటీవ‌ల సూచాయ‌గా వెల్ల‌డించారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ(Vizag Steel) బిడ్ అంటూ బీఆర్ఎస్ సీన్లోకి వ‌చ్చింది. ఆ పార్టీకి జై కొడుతూ ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలోకి ఆయ‌న వెళుతున్నార‌ని చాలా మంది ఫిక్స్ అయ్యారు. అయితే, బీఆర్ఎస్ గేమాడింద‌ని తెలుసుకున్న ఆయ‌న విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌న‌ణకు వ్య‌తిరేకంగా పాద‌యాత్ర‌కు దిగారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో ల‌క్ష్మీనారాయ‌ణ (Vizag steel)

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై(Vizag Steel)  కేంద్రం వెనక్కి తగ్గాలంటే కార్మికులు, నిర్వాసితులు, మేధావులు కలిసి కట్టుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ప్రజల తరఫున విశాఖ ఉక్కు పరిశ్రమ బిడ్డింగ్ లో తాను పాల్గొంటానని ఆయన వెల్లడించారు. ఆ మేరకు శనివారం ఉదయం విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్రలో జేడీ లక్ష్మీనారాయణ(Lakshmi narayana)పాల్గొన్నారు. స‌రిగ్గా ఇక్క‌డే ల‌క్ష్మీనారాయ‌ణ వ్యాఖ్య‌ల మీద దుమారం రేగుతోంది. ఆయ‌న‌కు అర్హ‌త లేకుండా ఎలా బిడ్ వేస్తారు అనేది అర్థంకాని అంశం.

Also Read : Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `క‌ల్వ‌కుంట్ల‌`తో అంతే.!

మరోవైపు, ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ పేరుతో విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ శనివారం పాదయాత్ర చేపట్టింది. కూర్మన్నపాలెం నుంచి సింహాచలం వరకు చేపట్టిన ఈ యాత్రలో కార్మికులతో పాటు పలువురు నేతలు కూడా కలిసి నడుస్తున్నారు. పూటకో ప్రకటన చేస్తోందంటూ కేంద్రంపై కార్మికులు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి కులస్తీ ఫ్లెక్సీపై కోడిగుడ్లు వేసి నిరసన తెలిపారు. ఆ ఉద్య‌మాన్ని రాజ‌కీయ పార్టీలు సానుకూలంగా మ‌లుచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ జాబితాలో ల‌క్ష్మీనారాయ‌ణ కూడా ఉన్నార‌ని అప‌వాదును ఆయ‌న ఎదుర్కొంటున్నారు.

Also Read : Jagan & KCR on Vizag Steel: విశాఖ స్టీల్ పై జగన్, కేసీఆర్ వ్యూహం! నెక్స్ట్ మచిలీపట్నం ఓడరేవు!