Site icon HashtagU Telugu

Vizag kapu : కాపునాడుకు వైసీపీ డుమ్మా, 5శాతం రిజ‌ర్వేజ‌న్ పై జ‌గ‌డం

Vizag Kapu

Ganta Kapu

విశాఖ కేంద్రంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన కాపు స‌మావేశం (Vizag Kapu) రాజ‌కీయ కాక రేపుతోంది. ఆ స‌మావేశంలో చేసే తీర్మానాల ఆధారంగా పొత్తులకు కూడా అవ‌కాశం ఉంటుంది. ప్ర‌ధానంగా సభ‌కు ఫేస్ గా మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు క‌నిపిస్తున్నారు. ఆయ‌న ` మెగా`ఫ్యామిలీకి సన్నిహితుడు. ప్ర‌త్యేకించి చిరంజీవికి ఆప్తుడుగా పేరుంది. ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా (TDP)ఉన్నారు. కానీ, పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల పార్టీకి రాజీనామా చేస్తూ చంద్ర‌బాబుకు లేఖ పంపారు. అయిన‌ప్ప‌టికీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. రాబోవు రోజుల్లో జ‌నసేన పార్టీ గూటికి చేర‌తార‌ని టాక్.

కాపు నాడు సభ (Vizag kapu)

కాపు నాడు సభ (Vizag Kapu) రాధా-రంగా రాయల్ అసోసియేషన్ మద్దతుగా విశాఖ‌లో పెట్టారు. దానికి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా గంటా శ్రీనివాసరావు ఉన్న‌ప్ప‌టికీ పార్టీల‌కు అతీతంగా ఆ సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ల‌కు ఆహ్వానాల‌ను పంపారు. వివిధ పార్టీల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రు కావ‌డానికి సిద్ధం అయ్యారు. కానీ, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు కాపునాడు స‌భ‌ను బాయ్ క‌ట్ చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. కాపునాడు స‌భ వెనుక జ‌న‌సేనాని ప‌వ‌న్‌, చంద్ర‌బాబునాయుడు ఉన్నార‌ని వైసీపీ అనుమానం. అందుకే, ఆ స‌భ‌కు వెళ్ల‌కూడ‌ద‌ని వైసీపీ నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది.

Also Read : Kapu Leaders in AP: ఏపీలో `కాపు` క‌ల‌క‌లం!

విశాఖ కేంద్రంగా కాపునాడు (Vizag Kapu) చేసే తీర్మానాలు రాజ‌కీయ ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అవుతాయ‌ని ముందుగానే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి గ్ర‌హించార‌ట‌. ఆ స‌భ‌లో కాపుల‌కు సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌నే తీర్మానం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అందుకు వైసీసీ అంగీక‌రించే అవ‌కాశం లేద‌నే సంకేతం బ‌లంగా ఇవ్వ‌డానికి గైర్హాజ‌రు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. అంతేకాదు, కాపు రిజ‌ర్వేష‌న్ పై ఇటీవ‌ల పార్ల‌మెంట్ వేదిక‌గా ఒక స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న కేంద్రం చేసింది. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల‌ను రాష్ట్రాలు ఆయా వ‌ర్గాలకు ఇవ్వ‌డానికి అభ్యంత‌రం లేద‌ని చెప్పింది. దీంతో వైసీపీ ఇర‌కాటంలో ప‌డింది. ఒక వేళ కాపునాడు స‌భ‌లో వైసీపీ ఎమ్మెల్యేల స‌మ‌క్షంలో రిజ‌ర్వేష‌న్ల‌కు అనుకూలంగా తీర్మానం చేస్తే వెనుక‌బ‌డిన వ‌ర్గాలు వైసీపీకి దూరం అయ్యే ప్ర‌మాదం ఉంది.

అగ్ర‌వ‌ర్ణ‌పేద‌ల‌ 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం

అగ్ర‌వ‌ర్ణ‌పేద‌ల‌కు కేంద్రం ఇచ్చిన 10శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు ఇస్తామ‌ని (TDP)చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా అసెంబ్లీలో తీర్మానం చేశారు. దాన్ని కేంద్రానికి పంపారు. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ నుంచి ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి క్లారిటీ లేక‌పోవ‌డంతో గోడ‌మీద పిల్లిలా వైసీపీ కాలం గ‌డిపింది. రిజ‌ర్వేష‌న్ల అంశం కేంద్రం ప‌రిధిలోనిదంటూ కాలం వెళ్ల‌తీసింది. కానీ, ఇప్పుడు అమ‌లు చేయ‌డ‌మా? లేదా? అనేది వైసీపీ ప్ర‌భుత్వం మీద ఆధార‌ప‌డి ఉంది. ఒక వేళ అమ‌లు చేస్తే బీసీలు దూరం అవుతారు. అదే జ‌రిగితే, రాజకీయంగా న‌ష్ట‌పోయే ప్ర‌మాదం ఉంది. టీడీపీకి మ‌ద్ధ‌తుగా ఉండే బీసీలు 2019 ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి గుడ్ బై చెప్పడానికి ప్ర‌ధాన కార‌ణం రిజ‌ర్వేష‌న్ల‌లో 5శాతం కాపుల‌కు ఇవ్వ‌డ‌మే. అదే ప‌ని ఇప్పుడు వైసీపీ చేస్తే న‌ష్టం జ‌రుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అందుకే, విశాఖ కాపునాడుకు దూరంగా ఉండాల‌ని వైసీపీ ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్డ‌ర్ వేశాడ‌ని తెలుస్తోంది.

రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, కాపుల‌కు సీఎం ప‌ద‌వి

కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ ఇటీవల పార్ల‌మెంట్లో రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్లాడారు. వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల వేళ జీఎల్ వేసిన ప్ర‌శ్న‌కు ఇచ్చిన స‌మాధానం ఏపీ రాజ‌కీయాల‌ను మార్చుతుంద‌ని తెలియ‌ని అంశం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో కాపులకు ఆర్టికల్ 342 ఏ(3) ప్రకారం రిజర్వేషన్లు కల్పించొచ్చని కేంద్రం చెప్పింది. ఈడ‌బ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రాలకు కేంద్రం నుంచి అనుమతి అవసరం లేదని చెప్ప‌డంతో ఏపీలోని `కాపు`ల‌కు వ‌రంగా మారింది. ఆనాడు చంద్ర‌బాబు చేసిన కాపుల‌కు 5శాతం రిజ‌ర్వేష‌న్ అంశాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ అమ‌లు చేస్తుందా? లేదా? అనే సందిగ్ధం ఉంది. ఆ క్ర‌మంలో రిజ‌ర్వేష‌న్ల అమ‌లు, కాపుల‌కు సీఎం ప‌ద‌వి తీర్మానాల‌ను చేయ‌బోతున్నారు.

Also Read : Kapu Nestham: ‘కాపు’ కార్పొరేషన్ మాయాజాలం!