సెప్టెంబర్ నెలలో సీఎం జగన్మోహన్ రెడ్డి కాపురాన్ని విశాఖకు(Vizag Capital) మార్చేస్తున్నారు. పరిపాలన వికేంద్రీకరణలో (3 Capitals) భాగంగా విశాఖపట్నంకు కాపురాన్ని షిఫ్ట్ చేస్తున్నారు. ఆ విషయాన్ని శ్రీకాకుళం బహిరంగ సభ వేదికగా ఆయన ప్రకటించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాజధాని విశాఖపట్నంకు మార్చుతున్నానని చెప్పకుండా కాపురాన్ని మార్చుతున్నానంటూ ఆయన చెప్పడం గమనార్హం.
సెప్టెంబర్ నెలలో విశాఖకు(Vizag Capital)
గత నాలుగేళ్లుగా పలు సందర్బాల్లో విశాఖ రాజధానికి(Vizag Capital) ముహూర్తం పెట్టారు. ఈసారి సెప్టెంబర్ నుంచి కాపురం విశాఖపట్నం మార్చేస్తున్నాని ప్రకటించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత నాలుగేళ్లుగా ఇప్పటికి పది సార్లు ఇదే చెప్పావంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. `రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా మీ బిడ్డ ఈ సెప్టెంబర్ నుంచి విశాఖకు కాపురం మార్చేస్తున్నాడు.` అంటూ జగన్మోహన్ రెడ్డి చేసిన అస్పష్ట ప్రకటన చర్చనీయాంశం అయింది.
రాజధాని మార్పు గడువు సెప్టెంబర్ నెలలో
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటల్లోని సారాంశాన్ని తీసుకుంటే రాజధాని మార్పు గడువు సెప్టెంబర్ నెలలో పెట్టారు. రాజధాని తరలింపులో భాగంగా సీఎం వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. సెప్టెంబరు నుంచి విశాఖపట్నం(Vizag Capital) నుంచి తమ ప్రభుత్వం పాలన సాగుతుందని అన్నారు. అమరావతి పోర్టు సిటీకి మారుస్తానని శ్రీకాకుళంలో సీఎం ప్రకటించారు. ఆయన గత ప్రతిపాదన ప్రకారం(3 Capitals) పరిపాలన రాజధాని విశాఖపట్నం, న్యాయ రాజధాని కర్నూలు, శాసన రాజధాని అమరావతి. మూడు చోట్ల నుంచి పరిపాలన సాగుతుంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం వేదికగా ప్రకటించారు.
తుది తీర్పు రాకుండానే మూడు రాజధానుల అంశాన్ని
వాస్తవంగా అమరావతి రాజధాని విచారణ సుప్రీం కోర్టులో ఉంది. దానిపై విచారణ జరిగాల్సి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఉండాలని విపక్షాలన్నీ అంటున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటున్నాయి. ఏపీ హైకోర్టు కూడా అదే చెప్పింది. సీఆర్డీఏ ఒప్పందాల ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన రాజధాని చూపాలని ఆదేశించింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి సర్కార్ తుది తీర్పు రాకుండానే మూడు రాజధానుల అంశాన్ని ప్రకటించడం గమనార్హం.
Also Read : AP Capital : అమరావతి వెలుగుతోంది.! రైల్వే లైన్ షురూ!
హైకోర్టును మార్చడం జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు. సుప్రీం కోర్టు కొలిజయం అనుమతితో పాటు రాష్ట్రపతి ఆమోదం ఉండాలి. ఇక పరిపాలన రాజధాని మార్చాలంటే సుప్రీం కోర్టు తుది తీర్పు ఇవ్వాలి. ఇప్పటికే మూడు రాజధానుల బిల్లును జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఆ మేరకు హైకోర్టుకు క్లియర్ గా ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు మళ్లీ మూడు రాజధానులు (3 Capitals)అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం వివాదస్పదం అవుతోంది. ప్రస్తుతం వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మీద జరుగుతోన్న చర్చను మళ్లించడానికి ఇలాంటి ప్రకటన చేసి ఉంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read : AP Capital : ప్రపంచ టాప్ -6 నగరాల్లో అమరావతి,`మేగజైన్` చెప్పిన నిజాలు
https://twitter.com/KP_Aashish/status/1648588668750409728?t=FAlDHpbjvvNn_UiLtpm-lQ&s=08