ప్రజల్ని తికమక పెట్టడం రాజకీయాల్లోని పెద్ద ఎత్తుగడ. అలాంటి వ్యూహాన్ని వైసీపీ ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే, వైఎస్ వివేకానందరెడ్డి(Viveka) కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి(sunitha Reddy) తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారని ప్రచారానికి దిగింది. రాయలసీమలోని ప్రొద్దుటూరు, కడప, పులివెందుల ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఆమె పోస్టర్లు గోడలకు కనిపిస్తున్నాయి. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నట్టు పోస్టర్లను క్రియేట్ చేశారు. టీడీపీ అగ్రనేతల ఫోటోలు, వివేకా సునితారెడ్డి ఫోటో లను ఉంచుతూ ఆ పోస్టర్లను డిజైన్ చేశారు. ఉదయం నుంచి ఆ పోస్టర్ల కలకలం రాజకీయ వర్గాల్లో బయలు దేరింది.
డాక్టర్ సునీతారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళుతున్నారని పోస్టర్లు (Viveka)
కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. ముందస్తు బెయిల్ పిటిషన్ చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన తరువాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వైఎస్ భారతి పీఏ నవీన్, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని సీబీఐ విచారించింది. గత వారం రోజులుగా భాస్కర్. రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి, కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలను వెలుగు చేస్తాయని సీబీఐ భావిస్తోంది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి (Viveka) హత్య వెనుక సూత్రధారిగా అవినాష్ రెడ్డి ఉన్నారని ప్రాథమికంగా సీబీఐ నిర్థారణ వచ్చింది. ఆ రోజున ఫోన్లు ఎవరెవరికి చేశారు? ఎంత సేపు మాట్లాడారు? అనే దానిపై నిర్థారణకు రానున్నారు.
అవినాష్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి అవకాశం
గత వారం రోజులుగా వివేకానందరెడ్డి (Viveka) హత్య గురించి జరుగుతోన్న విచారణ మీద ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూలంకుషంగా తెలుసుకుంటున్నారట. ఢిల్లీ టూ హైదరాబాద్ వయా తాడేపల్లి అన్నట్టు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. సుప్రీం కోర్టులో పోరాడిన మహిళగా సునీతారెడ్డికి(sunitha Reddy) పేరొచ్చింది. ఆమె వైఎస్ కుటుంబం మీద ధైర్యంగా పోరాడారు. ఆ పోరాటం వెనుక చంద్రబాబునాయుడు మద్ధతు ఉందని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు ఇప్పటికే పలుమార్లు వైసీపీ నేతలు సునితారెడ్డి మీద ఆరోపణలకు దిగారు. ఆ క్రమంలో ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని కూడా సీబీఐ విచారణ చేసింది. కానీ, వివేకా హత్య వెనుక అవినాష్ రెడ్డి అండ్ టీమ్ ఉందని సీబీఐ నిర్థారణకు వస్తోంది. అందుకే, ఇప్పుడు ప్రజలందరూ ఆసక్తిగా ఈ కేసు గురించి గమనిస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ కుటుంబం మీద పోరాడిన సునితారెడ్డిని రాజకీయ రచ్చలోకి వైసీపీ లాగింది.
Also Read : Viveka:తాడేపల్లికి సుప్రీం వేడి!అవినాష్ అరెస్ట్ తథ్యం?
తెలుగుదేశం పార్టీతో కుమ్మకై మాజీ మంత్రి వివేకానందరెడ్డి(Viveka) హత్య కేసును అవినాష్ అండ్ టీమ్ మీద సునీతారెడ్డి (sunitha Reddy)వేస్తున్నారని రాజకీయ కోణాన్ని వైసీపీ ఆవిష్కరించడానికి సిద్దమయింది. ఆ క్రమంలో వాల్ పోస్టర్లు వెలవడం తొలి ప్రయత్నం. ఇక రాబోవు రోజుల్లో ఇలాంటి రాజకీయ దుమారాలను సునితారెడ్డి ఎదుర్కోవడం తప్పదని తెలుస్తోంది. ఆమె మీద తెలుగుదేశం పార్టీ మచ్చను వేసి ప్రజాక్షేత్రంలో వివేకా హత్య కేసు నుంచి తప్పుకోవడానికి అవినాష్ అండ్ టీమ్ ప్రయత్నం చేస్తోందని సర్వత్రా వినిపిస్తోంది.