Viveka Murder : అవినాష్ కు బెయిల్, ఇక వివేకా హ‌త్య విచార‌ణ‌.!

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య (Viveka Murder )కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది.

  • Written By:
  • Updated On - May 31, 2023 / 12:03 PM IST

చ‌ట్టం త‌న ప‌ని తాను చేసింది. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య (Viveka Murder )కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చింది. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ మీద విచార‌ణ చేసిన తెలంగాణ హైకోర్టు (High court)కండీష‌న్ల‌తో కూడిన బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ క‌థ కంచికి చేరిన‌ట్టే. దేశం విడిచి వెళ్ల‌డానికి సీబీఐ అనుమ‌తి తీసుకోవాల‌ని అవినాష్ రెడ్డికి సూచించింది. ప్ర‌తి శ‌నివారం ఉద‌యం 10.30 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు సీబీఐ ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నిబంధ‌న పెట్టింది. ఒక వేళ బెయిల్ కండీష‌న్ల‌ను అవినాష్ రెడ్డి ధిక్క‌రిస్తే కోర్టుకు వెళ్ల‌డానికి సీబీఐకి అవ‌కాశం క‌ల్పిస్తూ తెలంగాణ హైకోర్టు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించింది.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్(Viveka Murder )

రాత‌పూర్వ‌క ఆధారాల‌ను చూపిస్తేనే న్యాయ‌స్థానం న‌మ్ముతుంది. అందుకే, కోర్టు హాలులో న్యాయ‌దేవ‌త క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి ఉంటాయంటారు. చెడు చూసినా, చెడు విన్నా, చెడు మాట్లాడినా రాత‌పూర్వ‌క ఆధారం ఉంటేనే న్యాయ‌స్థానం న‌మ్ముతుంది. లేదంటే, క‌ళ్లు మూసుకుని మౌనంగా ఉంటుంది. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Vivek Murder) కేసులోనూ అంతే. హ‌త్య చేసిన వాళ్ల వాగ్మూలం ఆధారంగా విచార‌ణ చేసిన సీబీఐ ప‌లు చార్జిషీట్లు వేసింది. అఫిడ‌విట్ల‌ను దాఖ‌లు ప‌రిచింది. క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి ఆ హ‌త్య వెనుక సూత్రధార‌ని తేల్చింది. హ‌త్య త‌రువాత ముందు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి (Jaganmohan Reddy)మొత్తం తెలుసని విచార‌ణ నివేదిక‌ను సీబీఐ కోర్టుకు అంద‌చేసింది. ఆ విచార‌ణ అంతా తూచ్ అంటూ తేల్చేసింది. అభియోగాల‌కు స‌రైన ఆధారాలు లేవ‌ని తేల్చేసింది. ముంద‌స్తు బెయిల్ అవినాష్ రెడ్డికి ఇస్తూ ఆయ‌న అరెస్ట్ ఎపిసోడ్ కు శాశ్వ‌త ఫుల్ స్టాప్ పెట్టేసింది.

Also Read : Viveka Murder : జ‌గ‌న్ ఢిల్లీ వెళ్లిన వేళ..అవినాష్ రెడ్డికి ఊర‌ట‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, జ‌డ్జిల తీరును, తీర్పుల‌ను సామాన్యులు ఎవ‌రూ విమ‌ర్శించ‌డానికి లేదు. అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డానికి కూడా లేదు. అలా చేస్తే, కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుంది. నేరం కింద‌కు కూడా వ‌స్తుంద‌ని తాజాగా సుప్రీం కోర్టు చెప్పేసింది. కానీ, సుప్రీం కోర్టు జ‌డ్జిలు న్యాయ వ్య‌వ‌స్థ‌లోని లోపాల‌ను, లొసుగుల‌ను నాలుగేళ్ల క్రితం మీడియాముఖంగా బ‌య‌ట‌పెట్టారు. ప‌లు సంద‌ర్భాల్లో జ‌డ్జిలను తెలంగాణ ఏసీబీ ట్రాప్ చేసింది. మైనింగ్ కింగ్ గాలి జ‌నార్థ‌న్ రెడ్డికి బెయిల్ ఇవ్వ‌డానికి లంచం తీసుకున్న ప‌ట్టాభి అనే జ‌డ్జిని అప్ప‌ట్లో సీబీఐ ప‌ట్టించింది. అయిన‌ప్ప‌టికీ కోర్టు తీర్పుల‌ను, నిర్ణ‌యాల‌ను ధిక్క‌రించ‌కూడద‌ని న్యాయ‌వ్య‌వ‌స్థ చెబుతోంది.

ఆ రెండు గంట‌ల చ‌ర్చ‌ల ఫ‌లితం బెయిల్

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్(Viveka Murder) విష‌యంలో సీబీఐ ప‌డిన క‌ష్టం అంతాఇంత కాదు. ఏనాడూ స్వేచ్ఛ‌గా ఆయ‌న్ను విచారించ‌లేక‌పోయింది. విచార‌ణ‌కు స‌హ‌కారం అందించ‌డంలేద‌ని కోర్టుకు సీబీఐ చెప్పింది. ముంద‌స్తు బెయిల్ ఇవ్వొద్ద‌ని అభ్య‌ర్థించింది. గ‌త మూడు నెల‌లుగా అంత‌లేని క‌థ‌లా సాగిని అరెస్ట్ వ్య‌వ‌హారం పలువురు అనుమానిస్తున్న‌ట్టే అట‌కెక్కింది. ఇప్ప‌టి మూడుసార్లు సీబీఐ ఎదుట హాజ‌రైన అవినాష్ రెడ్డి ఏ రోజుకారోజు అరెస్ట్ అంటూ ఒక సెక్ష‌న్ ఆఫ్ మీడియా న్యూస్ దంచికొట్టింది. కానీ, ఏనాడూ సీబీఐ చెప్పిన‌ట్టు అవినాష్ రెడ్డి స‌హ‌కారం అందించ‌లేదు. ఎప్ప‌టికప్పుడు విచార‌ణ నుంచి త‌ప్పించుకుంటూ విచార‌ణ‌ను మెలిక‌లు తిప్పారు. ఈనెల 26న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy)ఢిల్లీ వెళ్లి ర‌హ‌స్యంగా 2 గంట‌లు ఎవ‌రితోనే చ‌ర్చించారు. ఆ రెండు గంట‌ల చ‌ర్చ‌ల ఫ‌లితం బెయిల్ అంటూ స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. సో.ఇక మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ కోల్డ్ స్టోరేజీలో ప‌డిన‌ట్టే.

Also Read : YS Viveka Murder Case: వైస్ సునీతపై అనుమానం వ్యక్తం చేసిన వైస్ఆర్ సోదరి