Viveka Murder : గంగిరెడ్డి అరెస్ట్ కు CBI సిద్ధం! అనినాష్‌కి బేడీలు త‌ప్ప‌వ్ ?

సీబీఐ త‌న పని తాను చేసుకుని వెళ్లొచ్చు..`(Viveka Murder) అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పింది. అదే త‌ర‌హాలో సుప్రీం కోర్టు కూడా సంకేతాలు ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 03:11 PM IST

`సీబీఐ త‌న పని తాను చేసుకుని వెళ్లొచ్చు..` (Viveka Murder) అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పింది. అదే త‌ర‌హాలో సుప్రీం కోర్టు కూడా సంకేతాలు ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ, సీబీఐ(CBI) ఒక అడుగు కూడా ముందుకు వేయ‌డంలేదనే భావ‌న క‌లిగేలా అవినాష్ రెడ్డి(Avinash Reddy) అరెస్ట్ ను వాయిదా ప‌డుతోంది. సీఆర్పీసీ 160 నోటీసులు ఇచ్చి, ఆయ‌న్ను విచార‌ణ చేసిన‌ప్ప‌టికీ అరెస్ట్ ప్ర‌స్తావ‌న లేదు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక సూత్ర‌ధారి అవినాష్ అంటూ సీబీఐ ఇప్ప‌టికే అఫిడ‌విట్ లో పొందుప‌రిచింది. గుగూల్ టేకౌట్ ఆధారంగా హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశానికి స‌మీపంలోనే అవినాష్ రెడ్డి ఉన్నార‌ని నిర్థారించుకుంది. ఆయ‌న తండ్రి భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ హ‌త్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి శుక్ర‌వారం సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఆ మేర‌కు ఆయ‌న ఒక ప్రైవేటు ఛాన‌ల్ కు లీకులు ఇచ్చారు.

హ‌త్య కేసులో ఏ1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి శుక్ర‌వారం సీబీఐ కోర్టులో (Viveka Murder)

ఇప్ప‌టి వ‌ర‌కు అవినాష్ రెడ్డి(Avinash Reddy)  చెప్పిన విధంగా లైంగివేధింపులు, రెండో వివాహం, ఆస్తుల గొడ‌వ‌లు హ‌త్య‌కు కార‌ణం కాద‌ని సీబీఐ ఒక నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. అంతేకాదు, అవినాష్ రెడ్డి చెబుతోన్న లేఖ‌ను కూడా సునీతారెడ్డి స్థానిక పోలీసుల‌కు ఆ రోజే అందించార‌ని సీబీఐ విచార‌ణ‌లో తెలిసింది. ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డి ని సీబీఐ విచారించిన త‌రువాత ఆస్తుల గొడ‌వ‌లు లేవ‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. వివిధ కోణాల నుంచి ద‌ర్యాప్తును తుది ద‌శ‌కు తీసుకొచ్చిన సీబీఐ క‌డ‌ప ఎంపీ సీటు కోసం మాత్ర‌మే వివేకానంద‌రెడ్డి హ‌త్య (Viveka Murder ) జ‌రిగిన‌ట్టు అనుమానిస్తోంది. హ‌త్య జరిగిన రెండో రోజు క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్థిగా అవినాష్ రెడ్డిని వైసీపీ ప్ర‌క‌టించ‌డం జ‌రిగిందని సీబీఐ తెలుసుకుంది. ఇదే కోణం నుంచి విచార‌ణ చేస్తోన్న సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి మాత్రం త‌ట‌ప‌టాయిస్తున్నారు.

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయ‌డానికి మాత్రం త‌ట‌ప‌టాయిస్తున్నారు

వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు (Viveka Murder) సంబంధించిన వివ‌రాల కోసం ఆయ‌న పీఏ కృష్ణారెడ్డి, ప‌నిమ‌నిషి ల‌క్ష్మీదేవి, ఆమె కుమారుడు ప్ర‌కాష్ ను బుధ‌వారం విచారించింది. వాళ్ల నుంచి పూర్తి స‌మాచారం తొలి నుంచి రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఎందుకంటే, కృష్ణారెడ్డి, ల‌క్ష్మీదేవి, ఆమె కుమారుడు ప్ర‌కాష్‌, వాచ్ మెన్ రంగ‌న్న తొలుత హ‌త్య జ‌రిగిన ప్ర‌దేశంలో ఉన్న వాళ్లు. అంతేకాదు, ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న వివేకానంద రెడ్డి బాడీని బాత్ రూంలోకి తీసుకెళ్లి క్లీన్ చేసిన వాళ్లుగా సీబీఐ భావిస్తోంది. అందుకే, సీన్ రీ క‌న‌స్ట్ర‌క్ష‌న్ చేస్తూ ఆ రోజు ఉద‌యం 6 గంట‌ల స‌మ‌యంలో ఏమి జ‌రిగింద‌నే పాయింట్ నుంచి ఆధారాల‌ను సేక‌రిస్తోంది. ఆ క్ర‌మంలో బుధ‌వారం వాళ్ల‌ను  విచారించ‌డం జ‌రిగింది.

పీఏ కృష్ణారెడ్డి, ప‌నిమ‌నిషి ల‌క్ష్మీదేవి ,ఆమె కుమారుడు ప్ర‌కాష్ విచార‌ణ‌

హ‌త్య ప్ర‌దేశంలో ఒక లెట‌ర్, మొబైల్ ఉన్న విష‌యాన్ని కృష్ణా రెడ్డి, ల‌క్ష్మీదేవి చెబుతున్నారు. వాటిని వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత‌(Dr. Sunitha), ఆమె భ‌ర్త రాజ‌శేఖ‌ర్ రెడ్డికి అప్ప‌గించినట్టు విచార‌ణ‌లో తేలింది. ఆ రోజు మ‌ధ్యాహ్నం వాళ్ల‌కు ఇవ్వ‌గా సాయంత్రం స్థానిక పోలీసులకు వాటిని అంద‌చేశారు. అయితే, ఆ లెట‌ర్ నిజ‌మైన‌ది కాద‌ని అవినాష్ రెడ్డి (Avinash Reddy)చెబుతున్నారు. అస‌లు లెట‌ర్ ను దాచేసి మ‌రో లెట‌ర్ ను పోలీసుల‌కు ఇచ్చార‌ని ట్విస్ట్ చేస్తున్నారు. కానీ, సీబీఐ మాత్రం అవినాష్ రెడ్డి మాత్ర‌మే హ‌త్య‌కు సూత్ర‌ధారిగా భావిస్తోంది. హ‌త్య చేయ‌డానికి ఉప‌యోగించిన గొడ్డ‌లి ఎక్క‌డ ఉందో ఇప్పటికీ తెలియ‌దు. ద‌స్త‌గిరి ఇచ్చిన వాగ్మూలం ప్ర‌కారం సీబీఐ(CBI) విచార‌ణ చేస్తూ వ‌చ్చింది. ఆ క్ర‌మంలో వెల్ల‌డైన అంశాలకు ఆధారాలు చూప‌డానికి సీబీఐ నానా తంటాలు ప‌డుతోంది.

Also Read : Viveka Case : CBIకి హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌, అవినాష్ అరెస్ట్ ?

హ‌త్య జ‌రిగిన రోజు న‌లుగురు స‌మావేశం అయ్యార‌ని, వాళ్ల‌ను విచార‌ణ చేస్తే మొత్తం ఎపిసోడ్ బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ప్ర‌చారం మొద‌లైయింది. ఆ న‌లుగురు ఎవ‌రు? అనేది మాత్రం బ‌య‌ట‌కు రావ‌డంలేదు. ఆ కోణం నుంచి కూడా సీబీఐ ఆలోచ‌న చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ హ‌త్య కేసులో ఏ 1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి (Gangi Reddy)ని శుక్ర‌వారం అరెస్ట్ చేస్తార‌ని తెలుస్తోంది. ఒక వేళ ఆయ‌న సీబీఐ(CBI) కోర్టులో లొంగిపోతే, క‌స్ట‌డీలోకి తీసుకుంటారు. అప్పుడు మ‌రిన్ని నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Also Read : Viveka Murder :నో బెయిల్ ఓన్లీ అరెస్ట్,తాడేప‌ల్లికిCBI?

వ‌చ్చే వారం అవినాష్ రెడ్డిని (Avinash Reddy) అరెస్ట్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కానీ, ఆయ‌న అరెస్ట్ చుట్టూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌వ‌ర్ లాబీయింగ్ ర‌క్ష‌ణగా ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఈ కేసు పూర్తి స్థాయి విచార‌ణ పూర్త‌యితే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ఆయ‌న భార్య భార‌తి కూడా జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని టీడీపీ చెబుతోంది. అందుకు బ‌లం చేకూరేలా సీబీఐ విచార‌ణ వేగంగా జ‌ర‌గ‌డంలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ ను వాయిదా వేస్తూ రావ‌డం వెనుక ఢిల్లీ లాబీయింగ్ అడ్డుపడుతుందని ప్ర‌చారం ఉంది. రోజుకో విధంగా మ‌లుపు తిరుగుతోన్న‌ వివేక హ‌త్య(Viveka Murder) ద‌ర్యాప్తు అంతులేని క‌థ‌లా మారింది.