Viveka CBI : అవినాష్ అరెస్ట్ క‌థ‌, నాలుగోసారి సీబీఐ విచార‌ణ‌

వైఎస్ వివేక హత్య (Viveka CBI) కేసులో అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్నారు.

  • Written By:
  • Publish Date - March 14, 2023 / 01:08 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ్ర‌ద‌ర్ అవినాష్ రెడ్డి సీబీఐ నుంచి త‌ప్పించుకోలేక‌పోయారు. మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య(Viveka CBI) కేసులో నాలుగోసారి ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) సీబీఐ ఎదుట హాజ‌ర‌య్యారు. ఈసారి ఆయ‌న్ను అరెస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. హైద‌రాబాద్ లోని సీబీఐ కార్యాల‌యం వ‌ద్ద ఉత్కంఠ వాతావ‌ర‌ణం న‌డుమ విచార‌ణ కొన‌సాగుతోంది. అరెస్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు. సోమ‌వారం వ‌ర‌కు మాత్రమే అరెస్ట్ నుంచి ఉప‌శ‌మ‌నం ఇస్తూ కోర్టు సూచ‌న‌లు చేసింది. ఆ త‌రువాత పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను చూపుతూ మంగ‌ళ‌వారం విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని అవినాష్ కోర్టును అభ్య‌ర్థించారు. కానీ, కోర్టు తిర‌స్క‌రించ‌డంతో అనివార్యంగా సీబీఐ విచార‌ణ‌కు అవినాష్ రెడ్డి హాజ‌ర‌య్యారు.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో(Viveka CBI)

వైఎస్ వివేక హత్య (Viveka CBI) కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై విచారించనున్నారు. జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న సీబీఐ అధికారులు విచారించారు. కొన‌సాగింపు లేకుండా స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోలేమంటూ కోర్టు స్పష్టం చేసింది. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ అవినాశ్ రెడ్డిని(Avinash Reddy) ప్రశ్నిస్తోంది. సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో అవినాశ్ ను విచార‌ణ కొన‌సాగుతోంది.

 నాలుగోసారి ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట

అంతకముందు తాను విచారణకు హాజరు కాలేనని ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున మంగళవారం విచారణను హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. తనకు మినహాయింపు ఇవ్వాలని సీబీఐని అవినాశ్ రెడ్డి(Avinash Reddy) కోరారు. అయితే దీనిపై సీబీఐ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో అవినాశ్ మంగళవారం సీబీఐ (Viveka CBI)విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ తెలంగాణ హైకోర్టు ముందు ఉంచింది. హత్య కేసుకు సబంధించిన దర్యాప్తు స్థాయి నివేదిక, హార్డ్ డిస్క్ ను 10 డాక్యుమెంట్లు, 35 సాక్షలు వాంగ్మూలాలు, వివేక రాసిన డెత్ నోట్, ఫోరెన్సిక్ నివేదిక, ఘటనాస్థలంలో ఆధారాలు చెరపకముందు తీసిన ఫోటోలు, కేసు డైరీ వివరాలను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సీబీఐ అందజేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డిపై కఠిన చర్యలొద్దని, తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది.

Also Read : Viveka : వివేకా హ‌త్య‌కు మ‌రో పెళ్లి లింకు, అవినాష్ కొత్త ట్విస్ట్‌!

గత ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ పాత్రపై ఆధారాలను సీబీఐ సమర్పించింది. దర్యాప్తు కీలకదశలో ఉన్నందున స్టే ఇవ్వొద్దని వాదించింది. ఇవాళ సీబీఐ విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న ఎంపీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య(Viveka CBI) కేసులో విచారణ ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని, తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు విచారణకు పిలవకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి (Avinash Reddy) దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ జరిపారు. గత విచారణలో కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి పాత్రకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ సమర్పించింది.

కేసు గురించి పూర్తి సమాచారం అవినాష్​  వద్ద

కోర్టు అడిగిన అన్ని పత్రాలను, రికార్డులను సమర్పించామని, దీనిపై త్వరగా తేల్చి దర్యాప్తునకు అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిలిపివేయవద్దని సీబీఐ అధికారులు విన్నవించారు. వివేకా హత్య(Viveka CBI) సమయంలో రాసిన లేఖను ఎఫ్ ఎస్ ఎల్ కు పంపి నివేదిక తెప్పించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీబీఐ తెలిపింది. వివేకా రాత నమూనాను పరీక్షించి.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించిన అభిప్రాయాన్ని సమర్పించామని పేర్కొంది. ఏ అంశాన్నీ వదిలి పెట్టడం లేదని నివేదించింది. హత్య జరిగిన రోజు 5 గంటల నుంచి 7 గంటల మధ్య ఘటనా స్థలంలో ఆధారాలు ధ్వంసం చేయడానికి అవినాష్‌ రెడ్డి ప్రయత్నించారన్నారు. ఈ కేసు గురించి పూర్తి సమాచారం అవినాష్​ (Avinash Reddy) వద్ద ఉందన్నారు.

ఆడియో, వీడియో రికార్డింగ్‌ జరిపామని

దర్యాప్తులో సాక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని, ఈ దశలో స్టే మంజూరు చేస్తే దర్యాప్తు పట్టాలు తప్పుతుందన్నారు. పిటిషనర్‌ (Vinash Reddy) అభ్యర్థించినట్లుగా ఆడియో, వీడియో రికార్డింగ్‌ జరిపామని..అందువల్ల ఎలాంటి ఉత్తర్వులూ అవసరం లేదన్నారు. విచారణ సమయంలో న్యాయవాదిని అనుమతించామని, ఐతే విచారణ గదిలోకి అనుమతించలేమని చెప్పారు. వీడియో, ఆడియో రికార్డింగ్‌ జరిపినపుడు న్యాయవాదిని సమీపంలోకి అనుమతిస్తే ఇబ్బంది ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇప్పుడు అనుమతిస్తే ఇది సంప్రదాయంగా మారుతుందని సీబీఐ న్యాయవాది జవాబిచ్చారు. తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరుగుతున్నపుడు భాస్కరరెడ్డిని కడపలో విచారణకు ఎందుకు పిలవాల్సి వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించగా ఆయన్ను తాము పిలవలేదని(Viveka CBI) సీబీఐ స్పష్టం చేసింది.

దర్యాప్తు అధికారిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు

అంతకుముందు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. తాము అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేసిన కొంతసేపటికే సునీతకు సమాచారం వెళ్లడం, ఆమె ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడం చూస్తుంటే, సీబీఐ, సునీత సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్లు ఉందన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని, దర్యాప్తు అధికారిని మార్చాలంటూ ఈ నెల 7న సీబీఐ డైరెక్టర్‌కు వినతి పత్రం పంపినట్లు తెలిపారు.

Also Read : Viveka Murder : వివేక మర్డర్ కేసులో వైసీపీ ఎంపీకి బిగుస్తున్న ఉచ్చు.. నేడు సీబీఐ విచార‌ణ‌కు తండ్రీకొడుకులు

సునీత తరపు పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సునీత ప్రతివాదిగా చేరకుండా ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారన్నారు. హత్యకు(Viveka CBI) సంబంధించి తెలిసిన విషయాలు పోలీసులకు వెల్లడించాల్సి ఉందని, అలా చేయకపోవడం నేరమేనని అన్నారు. జనవరి 28న, ఫిబ్రవరి 24న విచారణ చేపట్టినపుడు దర్యాప్తు అధికారిపై ఎలాంటి ఆరోపణలూ చేయలేదని, ఇప్పుడు దీనిపై ఆరోపణలు చేస్తున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇప్పుడు దర్యాప్తు అధికారిపై డైరెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నారని, ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు.

సీబీఐ హాజరు మినహాయిస్తూ ఇవ్వాలన్న అభ్యర్థనన..(Avinash Reddy)

వివేకా హత్య కేసులో(Viveka CBI) తనపై కఠిన చర్యలు తీసుకోరాదని, తదుపరి విచారణ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటిషన్‌లపై ఉత్తర్వులు వెలువరించేదాకా ఎంపీ అవినాష్‌ రెడ్డిపై(Avinash Reddy) అరెస్టు సహా కఠిన చర్యలు తీసుకోరాదంటూ సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పార్లమెంట్‌ సమావేశాల కారణంగా మంగళవారం సీబీఐ ముందు హాజరు నుంచి మినహాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలన్న అవినాష్‌రెడ్డి అభ్యర్థనను తిరస్కరించింది. గత విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం ముందే అవినాష్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఈ దశలో అవినాష్‌ తరఫు న్యాయవాది క్షమాపణ కోరడంతో ఇలాంటివి పునరావృతం కారాదని స్పష్టం చేసింది.

Also Read : Vivekananda Murder Case: వివేకా హత్య కేసులో అవినాష్! ఆయన అరెస్ట్ పై ఉత్కంఠ