Viveka CBI : హ‌త్య కేసు విచార‌ణ స్లో!ఢిల్లీ ఎఫెక్ట్, భాస్కర్ రెడ్డికి మ‌ళ్లీ నోటీసులు!

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు(Viveka CBI) విచార‌ణ నెమ్మ‌దించిందా?

  • Written By:
  • Publish Date - March 1, 2023 / 01:52 PM IST

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు(Viveka CBI) విచార‌ణ నెమ్మ‌దించిందా? ఢిల్లీ పెద్ద‌లు(Delhi BJP) సీబీఐ దూకుడును త‌గ్గించారా? ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ చిత్త‌శుద్దిని ప్ర‌శ్నించిన త‌రువాత కేసు విచార‌ణ మ‌రో మ‌లుపుకు చేరిందా? ఎందుకు భాస్క‌ర్ రెడ్డిని విచారించ‌డం ఆల‌స్యం అవుతుంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. అయితే, కొన్ని అపోహ‌లు, అనుమానాలు మాత్రం ఢిల్లీ వైపు మ‌ళ్లాయి. బీజేపీ ఢిల్లీ పెద్ద‌ల సూచ‌న మేర‌కు కేసు విచార‌ణ ఆల‌స్యం అవుతోంద‌ని మాత్రం కొంద‌రు న‌మ్ముతున్నారు. ఢిల్లీ వెళ్లిన ప్ర‌తిసారీ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ఆయ‌న కేసులు, వివేకా మ‌ర్డ‌ర్ కేసు విచార‌ణ ఆపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ర‌ని టీడీపీ చెప్ప‌డం ష‌రా మామూలుగా మారింది.

మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు విచార‌ణ (Viveka CBI) 

వాస్త‌వంగా ఎంపీ అనినాష్ రెడ్డిని రెండుసార్లు విచారించిన త‌రువాత ఆయ‌న్ను సీబీఐ అరెస్ట్ (Viveka CBI) చేస్తుంద‌ని అంద‌రూ ఉత్కంఠ‌గా చూశారు. అంతేకాదు, సునీల్ యాద‌వ్ బెయిల్ పిటిష‌న్ పై వేసిన కౌంట‌న్ ఫైల్ లోనూ వివేకా హ‌త్య కేసులో సూత్ర‌ధారిగా పేర్కొంది. నిందితులుగా ఉన్న ద‌స్త‌గిరి, గంగిరెడ్డి, సునీల్ యాదవ్, అవినాష్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డి అంద‌రూ హ‌త్య జ‌రిగిన త‌రువాత ఒకేచోట ఉన్నార‌ని గుగూల్ టేక్ ఔట్ ద్వారా గుర్తించారు. తొలిసారి విచార‌ణ‌కు వ‌చ్చిన‌ప్పుడు అవినాష్ రెడ్డి మొబైల్ కాల్ డేటాను సీబీఐ అధ్య‌య‌నం చేసింది. దాని ప్ర‌కారం హత్య జ‌రిగిన త‌రువాత వైఎస్ భార‌తి పీఏ న‌వీన్‌ , జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్ రెడ్డికి ఫోన్లు వెళ్లిన‌ట్టు సీబీఐ నిర్థార‌ణ‌కు వచ్చింది. ఈ మొత్తం విచార‌ణ సారాంశాన్ని గ‌మ‌నిస్తే రెండో సారి విచార‌ణ‌కు పిలిచిన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుంద‌ని చాలా మంది భావించారు. అంతేకాదు, అవినాష్ తండ్రి భాస్క‌ర్ రెడ్డిని విచారించ‌డానికి దూకుడుకుగా ముందుకు క‌దిలిన సీబీఐ ఆక‌స్మాత్తుగా స్లో అయింది. ఇక్క‌డే ప‌లు అనుమానాల‌కు(Delhi BJP) తావిస్తోంది.

Also Read : Viveka Murder : హ‌త్య కుట్ర‌దారుడు జ‌గ‌న్‌ బ‌ద్ర‌ర్ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ ?

వివేకా హ‌త్య కేసు(Viveka CBI) విచార‌ణ‌ను రాజ‌కీయ కోణం నుంచి వైసీపీ తీసుకెళుతోంది. సున్నా నుంచి 100 వైపు తీసుకెళ్ల‌డానికి సీబీఐ ప్ర‌య‌త్నిస్తుంద‌ని అవినాష్ రెడ్డి వాయిస్ పెంచారు. అంటే, ఏమీలేని చోట ఉన్న‌ట్టు నిర్థారించ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు. అంతేకాదు, సీబీఐ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ల వెనుక చంద్ర‌బాబు ఉన్నాడ‌ని వైసీపీ ప్ర‌చారానికి దిగింది. అంతేకాదు, టీడీపీ హ‌యాంలో జ‌రిగిన హ‌త్య‌గా చిత్రీక‌రిస్తూ చేతులు దులుపుకోవ‌డానికి రాజ‌కీయ కోణాన్ని ఆవిష్క‌రించింది. దీంతో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ కేసు విచార‌ణ క్ర‌మంలో డిఫెన్స్ లో ప‌డ్డార‌ని అంద‌రూ భావించారు. ఈలోపు లేమి జ‌రిగిందోగానీ, సీబీఐ విచార‌ణ వేగం త‌గ్గింది. ఎంపీ అవినాష్ తండ్రి భాస్క‌ర్ రెడ్డిని నాలుగు రోజుల క్రితం క‌డ‌ప వెళ్లి విచారించాలి. కానీ, సీబీఐ వెనుక‌డుగు వేసింది. స‌రిగ్గా ఇక్క‌డే(Delhi BJP) ద‌ర్యాప్తు సంస్థ మీద ఆరోప‌ణ‌లు, అపోహ‌ల‌కు తెర‌లేచింది.

వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు

దూకుడు త‌గ్గించిన సీబీఐ నింపాదిగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో(Viveka CBI) వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈ నోటీసులను అందజేశారు. ఈ నెల 12న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులలో సీబీఐ పేర్కొంది. విచారణకు రావాలంటూ గత నెల 18న నోటీసులు జారీ చేయగా, సమయం కావాలంటూ భాస్కర్ రెడ్డి కోరిని విష‌యం విదితమే. దీంతో సీబీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను కూడా అధికారులు ఇప్పటికే విచారించారు.

Also Read : Viveka Murder : మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ..?

సుప్రీం కోర్డు ఆదేశాల మేర‌కు సీబీఐ విచారణ సాగుతున్న‌ప్ప‌టికీ కేంద్రంలోని కొంద‌రు పెద్ద‌ల ప్ర‌మేయం(Delhi BJP) విచార‌ణ‌ను ఆపేస్తుంద‌ని వివేకా కుటుంబ స‌భ్యులు అనుమానిస్తున్నారు. ఇప్ప‌టికీ వివేకా కుమార్తె డాక్ట‌ర్ సునీత మాత్రం న్యాయం జ‌రుగుతుంద‌ని న‌మ్మ‌కంతో ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణ‌కు కేసు విచార‌ణ బ‌దిలీ అయిన త‌రువాత కొంత దూకుడుగా సీబీఐ క‌దిలింది. ఆ వేగాన్ని గ‌మ‌నించిన వాళ్లు హ‌త్య కేసు విచార‌ణ‌ క్లైమాక్స్ కు వ‌చ్చింద‌ని భావించారు. కానీ,విచార‌ణ అంతులేని క‌థ‌లా మారుతుంద‌ని తాజాగా అనుమానాలు బ‌ల‌పడుతున్నాయి. రెండోసారి విచార‌ణ సంద‌ర్భంగా ఒక లేఖ‌ను సీబీఐకి ఇచ్చిన అవినాష్ ఒక లాజిక్ పాయింట్ మీడియా ఎదుట బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. హ‌త్య జ‌రిగిన స్థ‌లంలో ఉన్న లేఖ‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని సీబీఐని డిమాండ్ చేశారు. ఇలా, ఏదో ఒక ర‌కంగా ఈ కేసు విచార‌ణ‌ను ట్విస్ట్ చేస్తూ ఢిల్లీ పెద్ద‌ల స‌హాయ‌, స‌హ‌కారంలో బ‌య‌ట‌ప‌డాల‌ని నిందితులు చూస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. తాజాగా భాస్క‌ర్ రెడ్డికి నోటీసులు అంద‌చేసిన సీబీఐ(Viveka CBI) ఏమి చేస్తుంది? అనేది చూడాలి.