Adari Anand : వైసీపీకి మరో షాక్ తగిలింది. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి వైసీపీకి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేశారు. తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఆడారి ఆనంద్ తో పాటు 12 మంది డైయిరీ డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ తెలిపారు.
ఆనంద్ తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు ఆనంత్ దూరంగా ఉంటున్నారు.ఈ క్రమంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. పార్టీకి చేసిన వారిలో విశాఖ డెయిరీ డెరెక్టర్లు శరగడం వరాహ వెంకట శంకరావు, పిల్లా రమా కుమారి, శీరం రెడ్డి సూర్యనారాయణ, కోళ్ల కాటమయ్య, దాడి పవన్ కుమార్, ఆరంగి రమణబాబు, చిటికెల రాజకుమారి, రెడ్డి రామకృష్ణ, సుందరపు ఈశ్వర్, పరదేశి గంగాధర్ ఉన్నారు. వీరంతా కూడా వైసీపీ కార్యాలయానికి తమ రాజీనామ లేఖలను పంపించారు.
అయితే అధికారికంగా విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా లేఖ వైసీపీకి చేరలేదని అంటున్నారు. మరి విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ రాజీనామా చేసిన తర్వాత టీడీపీ పార్టీలోకి వెళతారని ప్రచారం మొన్నటి నుంచే జరుగుతోంది.
Read Also: Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..