Visakha Cruise Terminal : విశాఖ నగరాన్ని అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చే దిశగా మరో ముందడుగు పడింది. నౌక ఆకారంలో నిర్మించిన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ (ఐసీటీ) రెడీ అయింది. ఈ సంవత్సరం మార్చి నుంచి వైజాగ్ ఐసీటీలో పూర్తిస్థాయి కార్యకలాపాలు మొదలుకానున్నాయి. 2వేల మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్థ్యం కలిగిన క్రూజ్ నౌకలను నిలిపేందుకు అనువుగా ఈ టెర్మినల్‌ను నిర్మించారు. ఇందులో కస్టమ్స్ విభాగం కౌంటర్, ఇమిగ్రేషన్ విభాగం కౌంటర్, రిటైల్ దుకాణాలు, డ్యూటీఫ్రీ సరుకులు విక్రయించే దుకాణాలు, ఫుడ్ కోర్టులు, లాంజ్‌లు వంటివన్నీ ఉంటాయి.
Also Read :Trains Timings Changed : ఈరోజు నుంచి రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు.. ఇవి తెలుసుకోండి
వైజాగ్ ఐసీటీ టెర్మినల్(Visakha Cruise Terminal) నుంచి యాక్టివిటీని సాగించాలని కోరేందుకు కార్డిలియా, రాయల్ కరేబియన్, ఎంఎస్‌సీ వంటి ప్రముఖ క్రూజ్ లైనర్లతో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ అధికారులు చర్చలు జరుపుతున్నారు. వైజాగ్ ఐసీటీ నుంచి మన దేశంలోని చెన్నై, సుందర్ బన్స్‌కు క్రూజ్ సర్వీసులను ప్రారంభించే అవకాశం ఉంది. దీంతోపాటు సింగపూర్, థాయ్‌లాండ్, శ్రీలంక వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా ఈ సర్వీసులు మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Also Read :New Year Celebrations: మొత్తం ఎన్ని దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు జరిగాయో తెలుసా?
వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్‌ను మొత్తం రూ.96.05 కోట్లతో నిర్మించారు. ఇందులో రూ.57.55 కోట్లను విశాఖ పోర్ట్ ట్రస్ట్, రూ.38.50 కోట్లను కేంద్ర పర్యాటకశాఖ సమకూర్చాయి. వాస్తవానికి 2023 సెప్టెంబరులోనే ఈ టెర్మినల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 2024 ఏప్రిల్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద లగ్జరీ క్రూజ్ షిప్ ‘‘ఓషియన్ వరల్డ్’’ ఇక్కడికి వచ్చింది. మొత్తం మీద ఈ టెర్మినల్ వల్ల విశాఖ పర్యాటకానికి మరింత ఊపు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నగరానికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. ఫలితంగా ఏపీకి టూరిజం ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారు కలిసికట్టుగా టూరిజం వికాసానికి చేస్తున్న ప్రయత్నాల వల్లే ఇలాంటి ప్రాజెక్టులు సాకారం అవుతున్నాయనే చర్చ జరుగుతోంది.