Sea Plane : విజయవాడ – శ్రీశైలం “సీ ప్లేన్” ట్రయల్ రన్ విజయవంతం

Sea Plane : మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.

Published By: HashtagU Telugu Desk
Vijayawada - Srisailam "Sea Plane" trial run successful

Vijayawada - Srisailam "Sea Plane" trial run successful

Vijayawada – Srisailam : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో రేపు(శనివారం)సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ క్రమంలో శ్రీశైలం పాతాళగంగ లోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా “సీ ప్లేన్” సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ఈజు విజయవాడ – శ్రీశైలం ‘సీ ప్లేన్’ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. మొదట విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి ‘సీ ప్లేన్’ శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు.

డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఈ 14 సీట్ల సీ ప్లేన్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. పౌర విమానయాన శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ‘సీ ప్లేన్’ ప్రయోగం చేపట్టాయి. దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని ఎన్డీయే 3 ప్రభుత్వం భావిస్తోంది. పదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా వివిధ కారణాలతో మరుగున పడిపోయాయి. తాజాగా, పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ సర్వీసుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి సైతం సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం సహా ఫ్లైట్ కనెక్టివిటీని పెంపొందించేందుకు సీ ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న 3 నెలల్లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాగా, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ది దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవలే జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌ను ఆడంబరంగా నిర్వహించగా పర్యాటక రంగంలో నూతన సాంకేతిక విప్లవంగా మారింది. ఇప్పుడు సీప్లేన్‌తో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే, దేశంలో నాలుగేళ్ల క్రితమే సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. గుజరాత్ నర్మదా జిదేల్లాలోని కేవడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు.

Read Also: Yadadri : యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆమోదం

 

 

 

  Last Updated: 08 Nov 2024, 03:42 PM IST