Site icon HashtagU Telugu

MP Kesineni : బెజ‌వాడ ఎంపీ సీటుపై కేశినేని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కాల్‌మ‌ని, సెక్స్ రాకెట్‌లో ఉన్నవాళ్లకు.. ?

MP kesineni

MP kesineni

బెజ‌వాడ ఎంపీ సీటుపై సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీకి బీసీలు వెన్నుముక‌గా ఉన్నార‌ని.. నీతి, నిజాయితీ, క్యారెక్ట‌ర్ ఉన్న‌బీసీ నేత‌ల‌కు విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇస్తే గెలిపించుకుంటాన‌ని వ్యాఖ్య‌లు చేశారు. కాల్‌మ‌ని, సెక్స్‌రాకెట్‌, భూక‌బ్జాదారులు వేల కోట్లు అక్ర‌మంగా సంపాదించుకున్న వారు బీసీలు కాద‌న్నారు. టీడీపీలో చాలా మంది బీసీలు ఉన్నార‌ని.. విజ‌య‌వాడ న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్‌గా గోగుల ర‌మ‌ణ మూడు సార్లు కార్పోరేట‌ర్‌గా ప‌ని చేశార‌ని.. ఐదేళ్లు డిప్యూటీ మేయ‌ర్‌గా గోగుల ర‌మ‌ణ మ‌చ్చ లేకుండా ప‌ని చేశార‌ని.. ఏ ప‌ద‌వి లేకుండా ఉన్న‌యువ‌నాయకుడు పెందుర్తి శ్రీనివాస్ పార్టీ కోసం 35 ఏళ్లుగా ప‌ని చేస్తున్నార‌ని ఎంపీ కేశినేని నాని తెలిపారు. జ‌నాన్ని హింసించి, కాల్‌మ‌ని, సెక్స్ రాకెట్‌లో ఉన్న వాళ్లు బీసీలు కాద‌న్నారు. బీసీ అంటే నీతి, నిజాయితీకి మారుపేర‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నిరుపేద వాళ్లైన క్యారెక్ట‌ర్ ఉన్న వాళ్ల కాళ్ల‌కి దండంపెడ‌తామ‌ని తెలిపారు. పార్టీ కోసం పని‌చేసే బీసీలు విజయవాడలో చాలా మంది ఉన్నారు. ఆటువంటి వారి గెలుపుకు తానే పని చేస్తాన‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బెజ‌వాడ టీడీపీలో గ్రూప్‌వార్ మ‌రింత ముదిరిపోతుంది. సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి వ్య‌తిరేకంగా ఆయ‌న సోద‌రుడు చిన్ని, దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్దా వెంక‌న్న‌లు ప‌ని చేస్తున్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ సీటు త‌న‌కే వ‌స్తుంద‌ని.. తానే పోటీ చేస్తున్నానంటూ ఇటీవ‌ల బుద్దా వెంక‌న్న వ్యాఖ్య‌లు చేశారు. ఇటు విజ‌య‌వాడ ఎంపీ సీటు కూడా బీసీల‌కు కేటాయించాలంటూ ఈ వ‌ర్గం నుంచి వినిపిస్తుంది. దీంతో కేశినేని నాని వారికి ఘాటుగా స‌మాధానం ఇచ్చారు. బీసీలంటే నీతి, నిజాయితీగా ఉంటార‌ని.. కాల్‌మ‌ని, సెక్స్‌రాకెట్‌, భూక‌బ్జాదారులు కాద‌న్నారు. ఎంపీ కేశినేని వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయం మ‌రింత హీటెక్కింది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో ఎంపీ టికెట్ మీద ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం.. రోజురోజుకీ వ‌ర్గ‌పోరు ముదిరిపోతుంటంతో బెజ‌వాడ టీడీపీ క్యాడ‌ర్‌లో ఆందోళ‌న నెల‌కొంది. ఇప్ప‌టికైన అధిష్టానం స్పందించి ఈ వ‌ర్గ‌పోరుని క‌ట్ట‌డి చేయ‌క‌పోతే ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌స్తుందని క్యాడ‌ర్ అభిప్రాయ ప‌డుతున్నారు.

Also Read:  CM Revanth – Delhi : ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్.. మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్‌తో చర్చ