Site icon HashtagU Telugu

MP Kesineni : చంద్ర‌బాబుపై అసంతృప్తిగా ఉండ‌టంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని.. అదంతా…?

MP kesineni

MP kesineni

గ‌త కొద్ది నెల‌లుగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని పై వ‌స్తున్న అసంతృప్తి వార్త‌ల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఎంపీ కార్యాల‌యంలో ఆయ‌న‌ జాతీయ జెండా ఎగుర‌వేశారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్ర‌బాబుపై అసంతృప్తిగా ఉన్నాన‌ని నేను ఎవ‌రికి చెప్పానంటూ ఓ మీడియా ప్ర‌తినిధికి కౌంట‌ర్ ఇచ్చారు. కొన్ని మీడియా సంస్థ‌లు ప‌ని క‌ట్టుకుని త‌న‌పై వార్త‌లు రాస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్‌పీల కోస‌మో.. వ్యక్తిగత ఎజెండాతోనో కాకుండా సమాజం పట్ల బాధ్యతతో మీడియా ప్ర‌వ‌ర్తించాల‌ని ఎంపీ కేశినేని నాని అన్నారు. త‌న‌కు అధిష్టానానికి మ‌ధ్య ఎలాంటి గ్యాప్ లేద‌ని.. పార్టీకోసం ప‌ని చేస్తున్నాన‌ని ఎంపీ నాని తెలిపారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం కాదని.. మహిళలకి సంబంధించిన విషయమని కేశినేని నాని అన్నారు. రాజకీయ నాయకులు చాలా నిస్వార్థంగా పని చెయ్యాలని సూచించారు. పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు ఒక్క కారు స్టిక్కర్ ను మాత్రమే ఇస్తుంద‌ని.. ప్రజాప్రతినిధుల నకిలీ కారు స్టిక్కర్ ను వాడుకొని కొన్ని సందర్భాలలో తీవ్రవాద దాడులు చేశారు. తన విజయవాడ, హైదరాబాద్ కార్లపై ఎక్కడైనా ఎంపీ స్టిక్కర్‌ కనపడిందా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తన ఢిల్లీ కారుకు మాత్రమే ఎంపీ స్టిక్కర్‌ ఉంటుందని, ఆ కారులో తన కుమార్తెను కూడా తిరగనివ్వనని కేశినేని నాని స్పష్టం చేశారు.