VIjayawada Corporation: అధికారం కోల్పోయిన వైసీపీ రోజు రోజుకి బలహీన పడుతుంది. గెలిచింది 11 మంది ఎమ్మెల్యేలే కావడంతో ఆ పార్టీలో ఉండేందుకు నేతలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు టీడీపీకి జంప్ అయ్యారు. తాజాగా ముగ్గురు ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.దీంతో వైసీపీ పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు. ఈ ఫిరాయింపుల పర్వం నిరాటంకంగా కొనసాగుతోందని అంటున్నారు. తాజాగా విజయవాడ వైసీపీ కార్పోరేటర్లు టీడీపీలో చేరారు. ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని, ఇతర నేతల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్పొరేటర్లు– 45 డివిజన్‌కు చెందిన కె హర్షద్, 44 డివిజన్‌కు చెందిన ఎం రత్న కుమారి, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 54 డివిజన్‌కు చెందిన మాధురి లావణ్య ఎన్టీఆర్ భవన్‌లో టిడిపిలో చేరారు. ఎంపీ చిన్ని, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా కార్పొరేటర్లకు టీడీపీలోకి స్వాగతం పలికారు.
విజయవాడని త్వరలో టీడీపీకి కంచుకోటగా మారుస్తానని చెప్పారు కేశినేని చిన్ని. మంచి ఇమేజ్ ఉన్న నేతలను టీడీపీలోకి తీసుకుంటామన్నారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి చెందిందని, మరో ఐదేళ్లలో నగరం పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమ, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, రాష్ట్ర మైనార్టీ టీడీపీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎండీ ఫతావుల్లా, రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎస్ బేగ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
Also Read: Tirumala : శ్రీవారి సన్నిధానంలో గోల్డెన్ బాయ్స్ హల్చల్..భక్తుల చూపంతా వీరి బంగారంపైనే