Vijayasai Reddy : చెల్లెమ్మా పురందేశ్వరీ అంటూ విజయసాయి ట్వీట్..

చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని...మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన

Published By: HashtagU Telugu Desk
Vijayasai Reddy Purandeswar

Vijayasai Reddy Purandeswar

గత కొద్దీ రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వ‌రి (Purandeswari) vs వైసీపీ (YCP) వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని , కేంద్ర నిధులు పక్కదారి మళ్లుతున్నాయని, రాష్ట్రంలో నేరాలు , ఘోరాలు పెరుగుతున్నాయని పురంధేశ్వ‌రి ఆరోపిస్తూ వస్తుంది. ఇదే క్రమంలో పురంధేశ్వ‌రి వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం దీటుగా సమాదానాలు చెపుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) సైతం సోషల్ మీడియా వేదికగా పురంధేశ్వ‌రి ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా చెల్లెమ్మా పురందేశ్వరీ అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. చెల్లెమ్మా పురందేశ్వరి! జిల్లాకు మీ నాన్న పేరు పెట్టిన జగన్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకొని…మీ నాన్నను వెన్నుపోటు పొడిచిన మీ మరిదికి శిక్ష పడకుండా మీరు చేస్తున్న పనిని ఏమంటారో దయచేసి చెప్పగలరా? భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తాడా? అంటూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

మీ సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ఎన్ని విన్యాసాలు చేస్తారు అంటూ మరో ట్వీట్ చేసారు. అంతేకాదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలవడం కోసం టీడీపీ పోటీ చేయొద్దని సలహా ఇచ్చింది మీరేనంట కదా పురందేశ్వరి అంటూ ఆయన ప్రశ్నించారు. మీ అందరి ఆస్తులు, నివాసాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించుకుంటే మీరు అధికారంలో ఉన్నట్టే అని అనుకుంటున్నారట కదా అంటూ నిలదీశారు. ఎన్ని విన్యాసాలు చేస్తారమ్మా! బీజేపీ గురించి కాక సామాజికవర్గ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారు.. అంటూ విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ ట్వీట్స్ ఫై పురందేశ్వరీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read Also : EC Announced Final Contestants List : తెలంగాణ ఎన్నికల బరిలో 2,290 మంది పోటీ – ఈసీ

  Last Updated: 16 Nov 2023, 03:32 PM IST