Site icon HashtagU Telugu

Vijayasai Reddy : టీడీపీ మూడు ముక్కలుగా చీలిపోవచ్చు.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

Vijayasai Reddy

Vijayasai Reddy

Vijayasai Reddy :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుస ట్వీట్లతో టీడీపీపై ఆయన  విరుచుపడ్డారు. టీడీపీ చీఫ్ జైలుకు వెళ్లినా,  ఆ పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీలో నెలకొన్న దయనీయస్థితిని ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీని సరైన దిశలో నడిపించే నాయకుడు లేకపోవడం వల్ల త్వరలోనే రెండు, మూడు ముక్కలుగా చీలిపోవచ్చని వివాదాస్పద కామెంట్స్ చేశారు. ‘‘గత 40 సంవత్సరాలుగా టీడీపీకి మద్దతిస్తున్న బలమైన వ్యాపార వర్గంలోనూ ఇప్పుడు పునరాలోచన మొదలైంది. చంద్రబాబు సాగించిన దోపిడీలను మేమెందుకు సమర్థించాలన్న ఆలోచనలో పడ్డారు. అది పార్టీ చీలికకు దారి తీస్తుంది’’ అని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

‘‘ఏపీ సిల్క్‌ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును నీతిమంతుడు అనడం సరికాదు. రెండు ఎకరాల ఆసామి.. హెరిటేజ్‌ ఎలా స్థాపించారో  ప్రజలందరికీ తెలుసు’’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘మా కంపెనీలో 2 శాతం షేర్లు అమ్మితే 400 కోట్లు వస్తాయి. అవినీతికి పాల్పడే ఖర్మ మాకేమిటి’’ అని ఇప్పుడు చెబితే నమ్మేదెవరు అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇక ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు.. రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఆయన సుప్రీం కోర్టులో వేసిన క్వాష్‌ పిటిషన్‌ రేపు ధర్మాసనం ముందుకు రానుంది.  ఇక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఈనెల 4న విచారణకు రావాలంటూ నారా లోకేష్‌కు కూడా ఏపీ  సీఐడీ నోటీసులు (Vijayasai Reddy) జారీ చేసింది.

Also read : KTR: ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చేలా దళితబంధు : మంత్రి కేటీఆర్