ఏపీ ప్రజలపై మరోసారి ధరల భారం పడుతుంది. రాష్ట్రంలో పాల ధరలు (Milk Price) పెరిగినట్లు విజయ డెయిరీ (Vijaya Dairy) యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి కొత్త ధరలు (Milk Price Hike) అమలులోకి వస్తాయని, నెలవారీ పాల కార్డు ఉన్నవారికి ఏప్రిల్ 8 వరకు పాత ధరలు వర్తిస్తాయని తెలిపారు. పాల ఉత్పత్తి తగ్గడం, పౌడర్, బటర్ ధరలు పెరగడం వంటి కారణాల వల్ల పాల ధరలు పెంచాల్సి వచ్చిందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ పెంపుతో సామాన్య ప్రజల జేబుకు చిల్లు పడనుంది.
Sweating: చంకల్లో వచ్చే విపరీతమైన చెమట కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
విజయ డెయిరీ మొత్తం ఏడు రకాల పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తోంది. అందులో గోల్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.74 నుండి రూ.76కి, ఫుల్ క్రీమ్ పాల ధర రూ.72 నుండి రూ.74కి, స్టాండర్డ్ పాల ధర రూ.62 నుండి రూ.64కి పెరిగింది. టోన్డ్ మిల్క్ రూ.58 నుండి రూ.60కి, డబుల్ టోన్డ్ మిల్క్ రూ.54 నుండి రూ.56కి పెరిగింది. హోమోజినైజ్డ్ ఫుల్ క్రీమ్ మిల్క్ లీటరు ధర రూ.68 నుండి రూ.72కి పెరిగింది. అలాగే టీ మేట్, పెరుగు ప్యాకెట్ల ధరల్లో కూడా రూ.1 నుండి రూ.2 పెరుగుదల కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా పాల ధరలు పెరగడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విజయ డెయిరీ అధికారులు తెలిపారు. ఈ ధరల పెరుగుదల సామాన్యులకు తీవ్ర ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా సాధారణంగా రోజువారీ పాల వినియోగం ఎక్కువగా ఉండే కుటుంబాలకు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుంది. పాల ధరల పెరుగుదలతో పాటు, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధిక భారాన్ని ఎదుర్కొంటున్నారు.