Site icon HashtagU Telugu

Vidadala Rajini : ‘విడదల రజిని’ కిడ్నాప్..

Vidadala Rajini Kidnapping

Vidadala Rajini Kidnapping

“విడదల రజిని” (Vidadala Rajini) కిడ్నాప్ (Kidnapping) అనగానే.. అంత మంత్రి విడదల రజిని అనుకునేరు..ఇక్కడ మరో విడదల రజిని ఉన్నారు. గుంటూరు వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఈమె స్వాతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. గత పది రోజులుగా ఈమె పేరు జిల్లాలో మారుమోగిపోతుంది. ఈ క్రమంలో ఈరోజు నామినేషన్ల పర్వం చివరి రోజు కావడం తో ఆమె నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈమె పేరు..వైసీపీ మంత్రి పేరు ఒకటే కావడం తో.. వైసీపీ నేత, మంత్రి విడదల రజిని కి ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఏర్పడుతుందని భావించిన వైసీపీ శ్రేణులు.. రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఉన్న రజని అనే మహిళను అక్కడి నుంచి బలవంతంగా నామినేషన్ వేయకుండా తీసుకెళ్లారు. కాగా మహిళ కిడ్నాప్ వార్తలు బయటకు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు మహిళను ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకున్నట్లు సమాచారం. దీనిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇలా రౌడీ రాజకీయాలు చేస్తున్నారని..కనీసం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Supreme Court WhatsApp : సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్.. ఎలా వినియోగించనున్నారో తెలుసా ?