Site icon HashtagU Telugu

YCP – Balakrishna : బాలకృష్ణ తప్పతాగి ఆ పనిచేస్తాడంటూ వైసీపీ ప్రచారం..

Ycp Fake Balakrishna

Ycp Fake Balakrishna

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) సోషల్ మీడియా ను బాగా నమ్ముకుంది..ఫేక్ ప్రచారం (Fake Campaign) తో నానా హడావిడి చేస్తూ ఓటర్లను , యువతను ఆకట్టుకునే పనిలో పడింది. ఇప్పటికే ఎన్నో రకాల యూట్యూబ్ చానెల్స్ , సోషల్ మీడియా పేజీ లలో టీడీపీ – జనసేన (TDP-Janasena) నేతలపై తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్న వైసీపీ..తాజాగా నందమూరి బాలకృష్ణ (Nandhamuri Balakrishna) ఫై ఓ ఫేక్ వార్త ను పోస్ట్ చేసింది.

హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ గతంలో తనను వేధింపులకు గురి చేశాడంటూ సీనియర్ నటి వెన్నెరాడై నిర్మల (Vennira Aadai Nirmala) చెప్పినట్లు వైసీపీ అధికార ట్విట్టర్ పేజీ లో పోస్ట్ చేసారు. కానీ ఆ వీడియో లో ఆమె ఏంచెప్పిందంటే..”అప్పట్లో నేను ఓ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరుకున్నా..ఆ చిత్ర హీరో మద్యం సేవించి ..మా ఇంట్లోకి వచ్చేందుకు ట్రై చేసాడు. తలుపు వేసి ఉండడం తో వాటిని తెరువాలంటూ గట్టిగా అరిచాడు. ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చెయ్యండి..నేనేం చేయను..ఇక్కడ నిద్రపోయి వెళ్ళిపోతానంటూ రాద్ధాంతం చేసాడు. జరిగిన విషయాన్నీ నెక్స్ట్ డే ఉదయం ఆ సినిమా దర్శక , నిర్మాతలకు చెప్పా. వారు నాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. ఇలాంటివి నాకు నచ్చవని బదులిచ్చి , ఆ చిత్రం నుండి వైదొలిగా” అని నిర్మల తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

కానీ వైసీపీ మాత్రం..” పేరుకేమో తెరపై అతను హీరో.. కానీ తెరచాటున మహిళల్ని లైంగికంగా వేధించే కామాంధుడు. అవుట్ డోర్ షూటింగ్స్‌లో అర్ధరాత్రి తప్పతాగి హీరోయిన్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల రూము దగ్గరికి వెళ్లి డోర్ కొట్టడం నందమూరి బాలకృష్ణకి అలవాటు. ఇప్పటికే రాధిక ఆప్టే, విచిత్ర తదితర హీరోయిన్లు తమని బాలయ్య వేధించిన తీరుని ఏకరువు పెట్టారు. 1975లో విడుదలైన అన్నదమ్ముల అనుబంధం సినిమా షూటింగ్ సమయంలో తన కంటే 13 ఏళ్లు వయసులో పెద్ద అయిన వెన్నిరాడై నిర్మలను కూడా బాలయ్య అర్ధరాత్రిళ్లు ఏడిపించాడట. సినిమాల్లో స్త్రీ జనోద్ధారకుడిగా ఫోజులు కొడతాడు.. కానీ చేసేవి అన్నీ నీచ పనులే. ఎంత చిల్లర బతుకులు మీ నాయకుడివి మీ ఇంట్లోని ఆడవాళ్లే మహిళలా.. మిగిలిన వాళ్లంటే అంత చులకనా..? ” అంటూ బాలకృష్ణ పేరును పెట్టి పోస్ట్ చేసింది.

దీనికి టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ‘నకిలీ ఫెలో… చెప్పుకోవటానికి ఏమి లేక, కేవలం ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుని, ఎలక్షన్ కి వెళ్తున్నాడు. నువ్వు వేసిన వీడియోలో, ఎక్కడైనా బాలయ్య పేరు ఉందా ? ఇలా ఆపాదించాలి అనుకుంటే, మీ పార్టీలో చాలా మంది జబర్దస్త్ ఆటగాళ్ళు ఉన్నారు. నిర్మల గారు బాలయ్య వ్యక్తిత్వం గురించి ఏమి చెప్తున్నారో ఈ వీడియోలో విను 👇..అయినా నువ్వు చెప్తున్న కామాంధుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా ? తండ్రి చనిపోయాడని తెలిసినా, రెండు రోజులు వరకు రాకుండా, కలకత్తా హోటల్ లో గడిపిన సైకోలా ఉంటాడు” అంటూ బదులు ఇచ్చింది. మరి వైసీపీ పోస్ట్ చేసిన పోస్ట్ ఫై నందమూరి బాలకృష్ణ ఏమైనా రియాక్ట్ అవుతాడేమో చూడాలి. వైసీపీ చేసిన ఈ పనికి అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం ఇంత ఛీ ఇంత దిగజారాలా ..! సిగ్గుండాలి ..! అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also : Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్ నుంచి వైదొలిగిన‌ విజయ్​ శేఖర్​ ​.. కార‌ణ‌మిదేనా..?