ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒంగోలు TDP నేత వీరయ్య చౌదరి హత్య (Veeraiah Chowdary Murder) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు నిర్వహించిన విచారణలో వీరయ్యను హత్య చేయడానికి నిందితులకు ప్రత్యేకంగా ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షల చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వడం జరిగినట్టు సమాచారం. ఈ కారణంగానే నిందితులు దాడి సమయంలో విరుచుకుపడి, వీరయ్య శరీరాన్ని తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తోంది.
PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
హత్య అనంతరం మృతదేహాన్ని పరిశీలించిన వైద్యులు సంచలన వివరాలు వెల్లడించారు. వీరయ్య శరీరంపై మొత్తం 53 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్య పరీక్షలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇది దాడి తీవ్రతను, నిందితుల దుర్మార్గత్వాన్ని సూచిస్తుంది. ఒక్కో పోటుకు భారీగా డబ్బు ఇవ్వడం వల్లనే నిందితులు అత్యంత కిరాతకంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం హత్య కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాల్లో అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హత్య కేసు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.