Big Shock to YCP : వాసిరెడ్డి పద్మ రాజీనామా

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కీలక నేతలు , ఎంపీలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతమంది అధిష్టానం ఫై ఆగ్రహం తో బయటకు రాగా..తాజాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma ) సైతం రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాని టికెట్ […]

Published By: HashtagU Telugu Desk
Vasireddy Padama

Vasireddy Padama

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. వరుసపెట్టి నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, కీలక నేతలు , ఎంపీలు , ఎమ్మెల్సీ లు ఇలా ఎంతమంది అధిష్టానం ఫై ఆగ్రహం తో బయటకు రాగా..తాజాగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma ) సైతం రాజీనామా చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకుగాని, తన భర్తకు గాని టికెట్ ఇవ్వాలని సీఎం జగన్‌ను ఆమె కోరారు. అయితే సీఎం జగన్ నుంచి ఎటువంటి స్పష్టత రాకపోవడతో వాసిరెడ్డి పద్మ మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. దీంతో పదవికి రాజీనామా చేశారు. పార్టీలో కార్యకర్తగానే పని చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఆమె 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లోకి రావడంతోనే ఆమెను ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆమె 2012లో వైసీపీ లో పార్టీలో చేరారు. అప్పుడు కూడా అధికార ప్రతినిధిగానే పని చేశారు. 2019లో వైఎస్ అధికారంలోకి రావడంతో ఆమెను సీఎం జగన్ మహిళ కమిషన్ చైర్ పర్సన్‌ను చేశారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు రాజీనామా చేసింది. మరి వైసీపీ లోనే కొనసాగుతుందా..లేక పార్టీ మారుతుందా అనేది చూడాలి.

Read Also : High Court : టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు..

  Last Updated: 07 Mar 2024, 12:00 PM IST