Site icon HashtagU Telugu

SVSN Varma : పిఠాపురంలో వర్మ కొత్త వ్యూహం..ఎవరికి నష్టం..?

Svsn Varma

Svsn Varma

పిఠాపురం (Pithapuram) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలిచిన తర్వాత టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ (SVSN Varma) రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన బలాన్ని చాటుకున్న వర్మ, 2024 ఎన్నికల్లో పొత్తు ధర్మం కింద జనసేనకు సీటును విడిచిపెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిచాక, వర్మ ప్రాధాన్యత తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను ఇప్పటికీ ప్రజల్లోనే ఉన్నానని వర్మ తన తాజా రాజకీయ కదలికలతో సంకేతాలు ఇస్తున్నారు.

Delimitation : నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు

తాజాగా “కార్యకర్తే అధినేత” అనే నినాదంతో వర్మ ప్రత్యక్షంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో లేకపోయినా, ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రత్యక్షంగా మత్స్యకార గ్రామాల్లో పర్యటించి హామీలు ఇస్తున్నారు. తాను ఇప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉన్నానని నిరూపించుకోవడానికి, తన రాజకీయ బలం తగ్గలేదని తెలియజేయడానికి ఆయన ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ అధికారికంగా హామీలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ వర్మ స్వయంగా హామీలు ఇవ్వడం, జనంలో తిరగడం, ఆయన రాజకీయంగా మరింత పటిష్టంగా మారేందుకు తోడ్పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

Joint Pains: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ సూపర్ డ్రింక్స్ తాగాల్సిందే!

ఇదే సమయంలో వర్మ దూకుడు టీడీపీ, జనసేన మధ్య కొత్త రాజకీయ సమీకరణాలకు దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. వర్మ తిరిగి బలంగా నిలబడితే, పిఠాపురం టీడీపీ కేడర్ ఆయన వెంటే ఉంటుందా? లేక జనసేన ఆధిపత్యాన్ని అంగీకరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిఠాపురంలో టీడీపీకి వర్మ ప్రాతినిధ్యం వహిస్తారని భావిస్తున్నప్పటికీ, ఆయన స్వతంత్రంగా రాజకీయాలను మలుచుకుంటున్న తీరు, జనసేన వైపు నుంచి ఎలా స్పందన వస్తుందో చూడాలి.