Pithapuram : పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం – వర్మ

పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.

  • Written By:
  • Publish Date - May 22, 2024 / 07:14 PM IST

పిఠాపురం వర్మ..ఎన్నికల ముందు వరకు కేవలం ఆ నియోజకవర్గం వరకు మాత్రమే తెలుసు..కానీ ఎప్పుడైతే పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరు ప్రకటించారో ఆ రోజు నుండి వర్మ పేరు మారుమోగిపోవడం స్టార్ట్ అయ్యింది. వాస్తవానికి ఈ నియోజకవర్గం నుండి ఆయన బరిలోకి దిగాల్సి ఉండే..కానీ పవన్ బరిలోకి దిగడం తో ఆయన పవన్ కు మద్దతు ఇచ్చారు. అంతే కాదు తానే బరిలో నిల్చున్న అన్నట్లు ప్రచారం చేసి అందరికి ఆదర్శం అయ్యారు. ఈయన ఎక్కడ కనిపించిన పవన్ అభిమానులు సెల్ఫీ లు తీసుకుంటూ..ఆయన చేసిన సాయానికి థాంక్స్ చెపుతున్నారట..తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో ఈ విషయాన్నీ చెప్పు కొచ్చారు. అంతే కాదు పిఠాపురంలో వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

పిఠాపురంలో పోలింగ్ శాతం పెరగడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదని చెప్పుకొచ్చారు. పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు భారీ ఎత్తున వైసీపీ పార్టీ కుట్రలు చేస్తుందని విమర్శించారు. పిఠాపురం, కాకినాడ జేఎన్టీయూ ప్రాంతాలలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ ఆ విషయాన్ని ధ్రువీకరించిందని పేర్కొన్నారు.దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించాలని ఎన్నికల అధికారులను ఆయన కోరడం జరిగింది. వైసీపీ ఓడిపోతే పెద్ద ఎత్తున అల్లర్లుకు పాల్పడే అవకాశం ఉందని వర్మ అనుమానం వ్యక్తం చేసారు.

ఇదిలా ఉంటె పిఠాపురం (Pithapuram)లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 60 నుండి 90 వేల మెజార్టీ తో విజయం సాదించబోతున్నారని వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) చెప్పడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబదించిన ఆడియో టేప్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇందులో పవన్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. ఆయనొక సెలబ్రెటీ అని, ఒక పార్టీకి ప్రెసిడెంట్ అని చెబుతూ పవన్ కోసం అందరూ వచ్చి ప్రచారం చేశారని గీత అన్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు 80 వేల నుంచి 90 వేల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిని పవన్ , జనసేన అభిమానులు షేర్ చేస్తూ వైసీపీపై కామెంట్స్ పెడుతున్నారు.

Read Also :  KTR: కరెంట్ కొరతతో శిశువులు, పేషెంట్ల ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత?