కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడ టీడీపీ సీటును త్యాగం చేసి పవన్ కళ్యాణ్‌ను గెలిపించిన మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ (SVSN Varma) గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన ప్రచారం జరుగుతోంది. వర్మ వైసీపీ(YCP)లో చేరుతున్నారన్న వార్తలు పిఠాపురం రాజకీయాల్లో గందరగోళానికి తెరలేపాయి. కూటమిలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఈ ప్రచారం సారాంశం. దీంతో పిఠాపురం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
వర్మ టీడీపీకి వీరాభిమాని అని, చంద్రబాబు, లోకేష్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అందుకే ఈ ప్రచారాన్ని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ విజయంలో వర్మ పాత్ర అమోఘమైనదన్నది నిర్వివాదాంశం. కానీ ఎన్నికల తర్వాత కూటమి ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఎమ్మెల్సీ పదవి గురించి ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, జనసేన నాయకులు ఆయనపై విమర్శలు చేయడం వంటి పరిణామాలు జరుగుతున్న ఈ ప్రచారం నిజమని నమ్మేవాళ్ళు కూడా లేకపోలేదు.
Jasprit Bumrah: బుమ్రాను ట్రోల్ చేస్తున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
ఈ ప్రచారాన్ని ఖండిస్తూ పిఠాపురం టీడీపీ నాయకులు ముందుకు వచ్చారు. వర్మను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వర్మ అభిమానులు, అనుచరులు సోషల్ మీడియా, యూట్యూబ్‌లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించారు.
ఈ ఘటనతో వర్మ పార్టీ మారతారా లేదా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఆయనపై జరుగుతున్న ఈ ప్రచారం పిఠాపురంలో తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీసింది. వర్మ భవిష్యత్తు రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ఈ మొత్తం వ్యవహారం పిఠాపురం రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.