Vangalapudi Anitha : హోంమంత్రి వంగలపూడి అనిత, తన పీఏ సంధు జగదీష్‌పై అవినీతి ఆరోపణలు, వేటు అంశం పై స్పందించారు. ఇటీవల విశాఖ సెంట్రల్ జైల్‌లో గంజాయి సరఫరా, సెల్ ఫోన్ల వినియోగం , రౌడీషీటర్ల వివాదాలు వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, జైల్లో జరిగే అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. నేడు విశాఖ సెంట్రల్ జైలును హోంమంత్రి అనిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “గత నెల రోజుల నుంచి విశాఖ సెంట్రల్ జైల్ గురించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి సరఫరా జరుగుతోందని వచ్చిన ఆరోపణలపై, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, విచారణ చేపట్టి కొంతమందిని సస్పెండ్ చేశాం. అలాగే, అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం,” అని తెలిపారు.
Gold Price Today : కొత్త సంవత్సరంలో మొదటిసారి తగ్గిన బంగారం, వెండి ధరలు
జైల్లో 1,075 మంది గంజాయి కేసులలో నిందితులుగా ఉన్నారని, సెల్ ఫోన్లు బయట పడటం, వాటి వినియోగంపై విచారణ కొనసాగుతోందని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. “సెల్ ఫోన్లు జైలులో దొరికితే, వాటి ఎవరివి అన్న విషయంపై ఎంక్వయిరీ కొనసాగుతోంది. కొంతమంది రౌడీషీటర్లు జైలు నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు గంజాయి తీసుకొస్తున్నారు. ఈ విషయాలపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నాం,” అని ఆమె చెప్పారు.
జైల్లో అవినీతి, అక్రమాలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారని ఆమె చెప్పారు. “జైలు వార్డర్లు యూనిఫామ్‌లో ఉండి ఆందోళన చేయడం సరైంది కాదు. లోపల, సవ్యంగా తనిఖీలు చేపట్టాం. బదిలీలు కూడా రూల్స్ ప్రకారం జరిగాయి. జైల్లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ, విధులకు దిద్దుబాటు చేస్తున్నాం,” అని హోంమంత్రి వివరించారు.
ఇప్పటికీ తన పీఏ సంధు జగదీష్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు, అవి మేనేజ్‌మెంట్‌కి, పార్టీకి ప్రతికూలంగా మారకుండా చూసుకోవడం ఆమెపై కీలక బాధ్యతగా ఉంది. “నా ప్రయివేట్ పీఏపై ఆరోపణలు రావడంతో, నేను స్వయంగా అతన్ని తొలగించా. చాలాసార్లు అతన్ని హెచ్చరించా, కానీ అతను మారలేదు. నేను చెప్పేదేంటంటే, టీడీపీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నట్లయితే, నా పిల్లలను కూడా పక్కన పెడతాను,” అని ఆమె స్పష్టం చేశారు.
Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ట్రైలర్ అదిరిందిగా..