Vande Bharat Sleeper : వచ్చే సంవత్సరం అందుబాటులోకి రానున్న వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ ఏయే రూట్లలో నడుస్తాయి ? మన తెలుగు రాష్ట్రాలలో వాటిని నడుపుతారా ? అనే దానిపై కొంత సమాచారం బయటికి వచ్చింది. వందేభారత్ స్లీపర్ ట్రైన్ ఒకదాన్ని నరసాపురం టు బెంగళూరు రూట్ లో నడిపే ప్రపోజల్ పరిశీలనలో ఉందట. ఇది అందుబాటులోకి వస్తే.. కేవలం 10 గంటల్లోనే నరసాపురం నుంచి బెంగళూరుకు వెళ్లొచ్చని అంటున్నారు. నరసాపురం టు బెంగళూరు వందేభారత్ స్లీపర్ ట్రైన్ ను గుంటూరు మీదుగా నడుపుతారా ? ఒంగోలు మీదగా నడుపుతారా ? అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏపీకి వందేభారత్ స్లీపర్ రైలు కేటాయింపుపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ మీదుగా 4 వందేభారత్ ట్రైన్స్ నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖకు, సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, విజయవాడ నుంచి చెన్నైకు, కాచిగూడ నుంచి బెంగళూరుకు వందేభారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో రెండు రైళ్లను గత నెల (సెప్టెంబర్)లోనే ప్రారంభించారు. రానున్న రోజుల్లో ఏపీ మీదుగా మరిన్ని వందేభారత్‌లు ప్రారంభం అయ్యే అవకాశం (Vande Bharat Sleeper) ఉందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
వందేభారత్ స్లీపర్ ట్రైన్స్ లో ఏముంటాయ్ ?
- వందేభారత్ స్లీపర్ ట్రైన్ బోగీల ప్రత్యేక విషయానికి వస్తే.. ఈ ప్రతి ట్రైన్ లో 857 బెర్త్‌లు ఉంటాయి.
- మొత్తం 857 బెర్త్ లలో 823 ప్రయాణికుల కోసం, 37 సిబ్బందికి కేటాయిస్తారు.
- ప్రతి బోగీలో మూడు టాయ్‌లెట్లు మాత్రమే ఉంటాయి.
- మినీ ప్యాంట్రీ ఉంటుంది.
- దివ్యాంగులకు అనువుగా ఉండేందుకు ర్యాంప్‌లు ఉంటాయి.