Site icon HashtagU Telugu

Big Shock : వంశీకి సంబదించిన కీలక వీడియో ను విడుదల చేసిన టీడీపీ

Tdp Releases Key Video Rela

Tdp Releases Key Video Rela

సాయంత్రం 07 గంటలకు సంచలన విషయాలను బయటపెడతానని జగన్ (Jagan) చెప్పేసరికి ఏ వీడియో బయటపెడతారో అని అంత అనుకున్నారు. కానీ అంతకంటే ముందే టీడీపీ (TDP) బిగ్ షాక్ ఇచ్చింది. సత్యవర్ధన్‌ను వంశీ(Vamshi) కిడ్నాప్ చేసిన తాలూక వీడియోను విడుదల చేసి షాక్ ఇచ్చింది. ఈ వీడియోకు జగన్ ఏం చెప్తారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

విజయవాడ జైలులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ నాయకులపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారిపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమంగా తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తూ, ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని పెంచాయి.

Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్‌లో రక్తపాతం

జగన్ చేసిన ఆరోపణలకు వెంటనే టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా జగన్ విమర్శలకు ప్రతిస్పందిస్తూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు అబద్ధాలు చెప్పడం జగన్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, కక్షసాధింపు, కుట్ర రాజకీయాలు జగన్ బ్రాండ్‌గా మారాయని అన్నారు. అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించి, దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేశారు. వంశీ కిడ్నాప్‌కు పాల్పడలేదని జగన్ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుతం వంశీ అరెస్టు, జగన్ పరామర్శ, టీడీపీ నాయకుల కౌంటర్ విమర్శలతో ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది.