AP Police : గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంట్లో రెండవ రోజు పడమట పోలీసులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసుల సహాయంతో వంశీ ఇంట్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు సోదాల్లో కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, సీసీ కెమెరా ఫూటేజీని సేకరించారు. వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్‌ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.
Read Also: Liquor Sales : మద్యం అమ్మకాల్లో రికార్డులు తిరగరాస్తున్న తెలంగాణ
అయితే సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో అరెస్టు చేసే సమయంలో ఆయన సెల్‌ఫోన్ దొరకలేదు. వ్యక్తిగత సహాయకుడి ఫోన్‌ను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. కాగా, టీడీపీ కేంద్ర కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను అపహరించి దాడి చేసిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా వల్లభనేని వం ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. ఇక, హైదరాబాద్‌లో వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించిన విషయం తెలిసిందే.
మరోవైపు సత్యవర్థన్‌ను బెదిరించిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసరపల్లికి చెదిన గంటా వీర్రాజుతోపాటు పెదఅవుట్‌పల్లికి చెందిన వేల్పూరి వంశీని అరెస్ట్ చేశారు. వీరికి సైతం న్యాయస్థానం రిమాండ్ విధించింది. మిగిలిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో వారి కోసం గాలింపు జరుగుతోంది. టవర్ లొకేషన్ల ఆధారంగా త్వరలోనే వీరిని అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు వెల్లడించారు