Vallabhaneni Vamsi : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఒకవైపు బెయిల్ ఊరట కలగగా, మరోవైపు సుప్రీంకోర్టు విచారణతో అతడి విడుదలపై ఉత్కంఠ నెలకొంది. తనపై నమోదైన 10 కేసుల్లోనూ బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటపడతారని అనుకున్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించి నూతన మలుపు తెచ్చింది.
Kavya Maran : సోషల్ మీడియా మీమ్స్‌పై తొలిసారి స్పందించిన కావ్య మారన్
వివరాల్లోకి వెళితే, ఏలూరు జిల్లా నూజివీడు కోర్టు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విధించిన షరతుల ప్రకారం, రూ. లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంది. అలాగే, వారానికి రెండు సార్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. ఇదివరకు నమోదైన కేసులన్నింటిలోనూ వంశీకి ఇదే తరహాలో బెయిల్ లభించింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వంశీకి మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలంటూ వేసిన ఆ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.
Pregnant lady : పుట్టబోయే బిడ్డ కోసం గర్బిణీలు మహిళలు తప్పక చేయించాల్సిన స్కానింగ్స్ ఏంటంటే?
దీని ఫలితంపై వంశీ విడుదల తదుపరి ప్రక్రియ ఆధారపడి ఉంది. గత ఫిబ్రవరిలో హైదరాబాదులోని మైహోం భుజా అపార్ట్‌మెంట్‌లో వంశీని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద పలువురు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వంశీ, అనంతరం తిరిగి జైలుకు తరలించబడ్డారు. చివరికి అన్ని కేసుల్లో బెయిల్ సాధించినా, సుప్రీంకోర్టులో విచారణకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.