Site icon HashtagU Telugu

Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్

Vamshi Rjd Jail

Vamshi Rjd Jail

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ (Vallabhaneni Vamsi 14 Days Remand) విధించింది. ఈ కేసులో వంశీతో పాటు ఆయన అనుచరులు లక్ష్మీపతి మరియు కృష్ణప్రసాద్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తరువాత, వంశీని విజయవాడకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచారు. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1.45 గంటల వరకు వాదనలు జరిగాయి. అనంతరం రిమాండ్ విధించారు.

Power Point Presentation: రేపు కుల గ‌ణ‌న‌, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్

వంశీపై ఉన్న కీలక ఆరోపణలు రిమాండ్ రిపోర్టులో వెల్లడయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ సత్యవర్ధన్‌ను బెదిరించడంలో వంశీ ప్రధాన పాత్ర పోషించారని పోలీసులు చెప్పారు. సత్యవర్ధన్‌ను బెదిరించి, మరణభయంతో వాంగ్మూలం ఇప్పించారు. విశాఖపట్నం పోలీసులు సత్యవర్ధన్‌ను విజయవాడకు తీసుకెళ్లి విచారించారు. ఈ కేసులో A7, A8 అనే నిందితులు కూడా ప్రధానంగా వ్యవహరించారని పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసు నేపథ్యం 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడి చుట్టూ తిరుగుతోంది. ఈ దాడిలో సత్యవర్ధన్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు దూషించారని, అక్కడి వాహనాలను ధ్వంసం చేశారని కిరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వంశీ, ఆయన అనుచరులు సత్యవర్ధన్‌పై ఒత్తిడి తెచ్చి, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరారు.