Uttarandhra TDP fight in Rushikonda: ఫలించిన చంద్రబాబు క్లాస్, ఉత్తరాంధ్ర టీడీపీ దూకుడు

టీడీపీ చంద్ర బాబు క్లాస్ ఉత్తరాంధ్ర లీడర్లపైనా పనిచేసింది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 28 నుంచి నవంబర్ ౩వ తేదీ వరకు పోరాట షెడ్యూల్ ను అయన ఇచ్చారు.

  • Written By:
  • Updated On - October 28, 2022 / 04:49 PM IST

టీడీపీ చంద్రబాబు క్లాస్ ఉత్తరాంధ్ర లీడర్లపైనా పనిచేసింది. ఆయన ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వచ్చారు. ఈ నెల 28 నుంచి నవంబర్ ౩వ తేదీ వరకు పోరాట షెడ్యూల్ ను అయన ఇచ్చారు. ఏ విధంగా ఉత్తరాంధ్ర సంపదను వైసీపీ దోచుకుంటుందో తెలియచేసేలా టీడీపీ లీడర్లు యుద్దానికి దిగారు. ముందుగానే సీరియస్ ను గమనించిన పోలీసులు ముందస్తు అరెస్టులు చేయటం ఉద్రిక్తతకు దారితీసింది.

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనితను విశాఖలో పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్ట్ చేశారు. ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ దగ్గర నిరసనకు టీడీపీ పిలుపునివ్వగా పోలీసులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. పార్టీ ఆఫీసుకు వెళ్తుంటే అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తానని, ఎవడినీ వదిలిపెట్టను ఆమె వార్ణింగ్ ఇచ్చారు. పోలీసులు నేమ్ ప్లేట్స్ లేకుండా డ్యూటీ చేస్తున్నారని, విశాఖలో పోలీసులు ప్రతిపక్ష నాయకులు దగ్గర కాపలా కాస్తే క్రైమ్ రేటు ఎందుకు తగ్గుతుంది. నగరంలో క్రైమ్ రేటు పెరుగుతుంది అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరిని వదిలి పెట్టేది లేదన్నారు. అక్రమాలు జరగకపోతే భయం ఎందుకు? రుషికొండకు వెళ్తుంటే అడ్డగింతలు ఎందుకు అంటూ ప్రశ్నించారు. కనీసం వాహనాలను కూడా అనుమతించలేదని, నడిచి పార్టీ ఆఫీసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పిల్లలతో సినిమాకు వెళితే అక్కడికి పోలీసులు వచ్చారని, తన ప్రైవసీకి భంగం కలిగిందన్నారు.

Also Read:   RGV: చంద్రబాబుకు వ్యతిరేకంగా `వర్మ` సినిమాలు – స్క్రీన్ ప్లే, డైరెక్షన్ జగన్..!

అనకొండ నోటిలో రుషికొండ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనకొండ సీఎం, అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.ఉత్తరాంధ్ర పోరుబాటలో భాగంగా రుషికొండ దగ్గర నిరసనకు టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ముందుగానే అప్రమత్తమై టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంతో పాటు రుషికొండ వద్ద పోలీసుల్ని మోహరించారు. రుషికొండకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. రుషికొండ నుంచి బీచ్ రోడ్‌వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. టీడీపీ నేతల అరెస్ట్‌లపై అధినేత చంద్రబాబు స్పందించారు. కొండలను మింగిన వైఎస్సార్‌సీపీ అనకొండల బండారం బయట పడుతుందనే టీడీపీ పోరుబాట పై ఆంక్షలు విధించారంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే నేతలు పోరుబాట పట్టారని, మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనమన్నారు.

`ఎవరు ఎంతగా అడ్డుకున్నా ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఆగదన్నారు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్‌ పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తామన్నారు` చంద్రబాబు. ఉద్దేశపూర్వకంగానే ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, గౌతు శిరీష వంటి నేతలను నిర్బంధించడాన్ని జగన్ వెన్నులో వణుకుగా టీడీపీ అభివర్ణిస్తుంది. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీని ప్రజలు గుర్తించి తిరగబడాలని టీడీపీ పిలుపునిచ్చింది.

Also Read:   Security Arrangements: కార్తీక మాసం సందర్భంగా సముద్ర తీరాల్లో భద్రతా ఏర్పాట్లు..!