Site icon HashtagU Telugu

UTs in Telugu States : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విశాఖ‌, హైద‌రాబాద్‌?

UTs in Telugu States

Ktr Dharmna Copy

`హైద‌రాబాద్ తెలంగాణకు క‌ల్ప‌త‌రువు..` అంటూ మంత్రి కేటీఆర్ జ‌న‌వ‌రి ఒక‌టో తేదీన బండ్ల‌గూడ ఫ్లైవోర్ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. య‌థాలాపంగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న‌గా అంద‌రూ అనుకున్నారు. కానీ, దాని వెనుక చాలా నిగూఢార్థం(UTs in Telugu States)  ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాల నుంచి అందుతోన్న స‌మాచారం. ఎందుకంటే, హైద‌రాబాద్ ఉమ్మ‌డి రాష్ట్రం గ‌డువు ముగిసిన త‌రువాత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చుతార‌ని చాలా కాలంగా ఉంది. ఆ మేర‌కు 2024 నాటికి కేంద్ర పాలిత ప్రాంతం అవుతుంద‌ని ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత రాకుండా ఏపీలోని విశాఖప‌ట్ట‌ణంను కూడా కేంద్ర‌పాలిత ప్రాంతం(union-territories) చేయ‌డానికి కేంద్రం సిద్దమ‌యింద‌ని స‌రికొత్త ప్ర‌చారం మొద‌లైయింది. ఆ ప్ర‌చారానికి బ‌లం చేకూరేలా ప్ర‌త్యేక రాష్ట్రంగా విశాఖ‌ను ( UTs in Telugu States) ఏర్పాటు చేసుకుంటామ‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. అటు మంత్రి కేటీఆర్ ఇటు మంత్రి ధ‌ర్మాన వ్యాఖ్య‌ల వెనుక చాలా రాజ‌కీయ కోణాలు (union-territories) ఉన్నాయ‌ని ప్ర‌చారం జోరందుకుంది.

కేంద్ర పాలిత ప్రాంతాలుగా విశాఖ‌, హైద‌రాబాద్‌ (UTs in Telugu States)

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌ను క‌లిపే కుట్ర జ‌రుగుతుంద‌ని ఇటీవ‌ల వినిపించిన ప్ర‌చారం. అంతేకాదు, స‌మైక్యానికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణ చేసిన కామెంట్‌. రెండు రాష్ట్రాల‌ను క‌లిప‌డానికి అనువుగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని మంత్రులు కొంద‌రు ఇటీవ‌ల చేసిన వ్యాఖ్యాలు. మ‌ళ్లీ కుట్ర జ‌రుగుతుంద‌ని తెలంగాణ‌కు చెందిన బీఆర్ఎస్ లీడ‌ర్లు ప్ర‌తిగా స్పందించారు. వ్యూహాత్మ‌కంగా వైసీపీ, బీఆర్ఎస్ సెంటిమెంట్ ను లేవ‌నెత్తుతుంద‌ని అనుకున్నారు. కానీ, ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌ని ప్ర‌తిపాద‌న‌లు రెండు రాష్ట్రాల విష‌యంలో కేంద్రం చేస్తోంద‌ని తాజాగా జ‌నంలో న‌డుస్తోన్న విస్తృత ప్ర‌చారం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

Also Read : Hyderabad MMTS : ఔటర్‌ చుట్టూ ఎంఎంటీఎస్‌ లో రూ.40 లతో ప్రయాణం

దేశానికి రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్ ను చేయాల‌ని రాజ్యాంగంలోని ఒక ప్ర‌తిపాద‌న‌. ఆ మేర‌కు బీజేపీ మూల సిద్దాంతాల్లో ఒక‌టిగా ఉంది. అందుకు అనుగుణంగా చాలా ఏళ్లుగా శీతాకాలం విడిదికి రాష్ట్ర‌ప‌తి హైద‌రాబాద్ రావ‌డం చూస్తున్నాం. దేశ రెండో రాజ‌ధానిగా చేస్తే ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఒక ప్రైవేటు జాతీయ టీవీ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఆ త‌రువాత దేశానికి రెండో రాజ‌ధానిగా బెంగుళూరును చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. చెన్నై న‌గ‌రాన్ని దేశ రెండో రాజ‌ధాని చేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం కోరింది.

అమ‌రావ‌తిని దేశ రెండో రాజ‌ధాని చేస్తే..

అమ‌రావ‌తిని దేశ రెండో రాజ‌ధాని చేస్తే బాగుంటుంద‌ని ఏపీ ప్ర‌భుత్వం తీర్మానం చేయ‌న‌ప్ప‌టికీ ప‌లువురు కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఢిల్లీ త‌ర‌హా రాజ‌ధాని నిర్మించి ఇస్తాన‌ని తిరుప‌తి కేంద్రంగా 2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా న‌రేంద్ర మోడీ ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం 33వేల ఎక‌రాల భూమి రాజ‌ధానికి ఉంది. మూడు రాజ‌ధానులంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటున్న‌ప్ప‌టికీ బీజేపీ మాత్రం అమ‌రావ‌తి రాజ‌ధాని అంటూ చెబుతోంది. ఆ క్ర‌మంలో దేశానికి రెండో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని చేస్తే జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకోవ‌చ్చ‌ని స‌గ‌టు ఆంధ్రుడు కోరుకోవ‌డంలో త‌ప్పులేదు.

కేంద్రం మాత్రంవిశాఖ‌ప‌ట్నంను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయ‌డానికి సిద్ధమ‌వుతుంద‌ని తాజాగా వినిపిస్తోన్న ప్ర‌చారం. ఎందుకంటే, అక్క‌డ నేవీతో పాటు కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లు అనేకం ఉన్నాయి. దేశ ర‌క్ష‌ణ‌తో ముడిప‌డి ఉన్న ప్రాంతం అది. అందుకే, కేంద్ర ప్రాలిత ప్రాంతంగా చేయాల‌ని కేంద్రం స‌రికొత్త ఆలోచ‌న చేస్తుంద‌ట‌. ఇక హైద‌రాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చ‌డం ద్వారా కంటోన్మెంట్ త‌ర‌హాలో చేయాల‌ని భావిస్తుంద‌ట‌.

Also Read : Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీల‌క కేంద్రం – ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని స‌గ భాగం భార‌త మిల‌టరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప‌రిధిలోనే ఉంది. ర‌క్ష‌ణ ద‌ళాల‌ను ఇక్క‌డ నుంచే అత్యవ‌స‌ర ప‌రిస్థితుల్లో మూవ్ చేస్తున్నారు. అందుకే, కేంద్ర పాలిత ప్రాంతంగా హైద‌రాబాద్ ను చేయ‌డం ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాల‌ని సిద్ధవుతున్న‌ట్టు స‌రికొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌హుశా అందుకే, మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ ను క‌ల్ప‌త‌రువుగా పోల్చి ఉంటారు. అలాగే, ఏపీ ఆర్థిక న‌గ‌రంగా విశాఖ ఉంది. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే మ‌రింత ఆర్థిక క‌ష్టాల్లోకి ఏపీ వెళ్ల‌డానికి అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ తాజాగా జరుగుతోన్న ప్ర‌చారం నిజం అవుతుందా? అనేది ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేక‌పోతున్నారు. ఒకేసారి విశాఖ‌, హైద‌రాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం గుర్తిస్తే తెలుగు ప్ర‌జ‌లు అంగీకరిస్తారా? అనేది ఆస‌క్తిక‌రం.