Usha Vance : అమెరికా నూతన వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ సతీసమేతంగా భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెలాఖరులో జేడీ వాన్స్, ఉషా వాన్స్‌లు మనదేశానికి వచ్చే అవకాశం ఉంది. ఈసందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లతో జేడీ వాన్స్ సమావేశమయ్యే అవకాశం ఉంది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఫోకస్ చేస్తూ చర్చలు జరిపే అవకాశం ఉంది. రక్షణరంగంలో సహకారం, విదేశాంగ సంబంధాల బలోపేతంపైనా ఫోకస్ ఉంటుంది. ‘‘అమెరికాకు చెందిన ఉత్పత్తులపై భారత్ భారీగా దిగుమతి సుంకాలను విధిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, ఇక భారత్‌కు ఏమీ అమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు’’ అంటూ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రపంచ దేశాలు అమెరికా ఉత్పత్తులపై ఎంతైతే దిగుమతి సుంకాలను విధిస్తున్నాయో.. మేమూ వాటి దిగుమతులపై అంతే మొత్తంలో సుంకాలను విధిస్తాం. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త లెక్క అమల్లోకి వస్తుంది’’ అని ట్రంప్ ప్రకటించారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 2 కంటే కొన్ని రోజుల ముందు భారత పర్యటనకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ వస్తుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Also Read :Kidney Problems: తెలంగాణలో దడ పుట్టిస్తున్న కిడ్నీ కేసులు.. నిమ్స్ సంచలన నివేదిక
ఉష మూలాలు భారత్‌లోనే..
ఈ పర్యటనలో మరో కోణం కూడా ఉంది. అదేమిటంటే.. ఉషా వాన్స్(Usha Vance)తో భారత్‌కు ఉన్న అనుబంధం. ఆమె తల్లిదండ్రుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు ఉషా వాన్స్ అమెరికాలో రెండో వనిత. ఆమెను చూసి యావత్ భారత దేశం, ప్రత్యేకించి తెలుగు ప్రజలు, తెలుగు మహిళా లోకం గర్విస్తోంది. ఉషా వాన్స్ పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని వద్దూరు గ్రామం. ఈసారి భారత పర్యటన సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్‌లో లేదా హైదరాబాద్‌లో పర్యటిస్తారా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read :Coverts In Congress: కాంగ్రెస్‌లో కోవర్టులు.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల్లో పచ్చి నిజాలు
ఉష తల్లిదండ్రుల గురించి..
ఉష తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980వ దశకంలోనే అమెరికాకు వలస వెళ్లారు. వీరి ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. ఉష తల్లి లక్ష్మి మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగంలో నిపుణురాలు. ప్రస్తుతం శాన్‌డియాగో యూనివర్సిటీలో కీలకమైన అడ్మినిస్ట్రేటివ్ పదవిలో ఉన్నారు. తండ్రి రాధాకృష్ణను అందరూ క్రిష్ చిలుకూరి అని పిలుస్తుంటారు. ఆయన ఏరోస్పేస్ ఇంజినీర్. యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్ ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా పనిచేశారు. ఆపై కాలిన్స్ ఏరోస్పేస్‌లో అసోసియేట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
ఉష కెరీర్ గురించి..
- ఉష అమెరికాలోనే పుట్టి పెరిగింది.
- ఆమె యేల్ యూనివర్సిటీలో హిస్టరీలో డిగ్రీ చేసింది.
- కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో పీజీ చేసింది.
- న్యాయ సంబంధమైన విభాగాల్లో ఉష సుదీర్ఘ కాలంపాటు పనిచేశారు.
- యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా, యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ఎడిటర్‌గా ఉష పనిచేశారు.