Site icon HashtagU Telugu

Pawan Kalyan Health : పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై కేంద్ర మంత్రి ట్వీట్

Union Minister's Tweet On P

Union Minister's Tweet On P

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి (Pawan Kalyan Health) గురైన సంగతి తెలిసిందే. ఆయన వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండగా, స్పాండిలైటిస్ సమస్య కూడా ఇబ్బంది పెడుతోంది. నాలుగు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ (Hardeep Singh Puri) పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై విచారాన్ని వ్యక్తం చేశారు.

Mission South : ప్రధాని మోడీ ‘మిషన్ సౌత్’.. పవన్ ఏం చేయబోతున్నారు ?

పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ హర్దీప్ సింగ్ పూరీ ట్వీట్ చేశారు. “ఆంధ్రప్రదేశ్ డైనమిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలోని ప్రముఖ నేతల నుంచి వచ్చిన ఈ స్పందన జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులను ఆనందింపజేసింది. కేంద్ర మంత్రికి పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలియజేశారు. “హర్దీప్ సింగ్ పూరీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు నాపై చూపిన ప్రేమ, సానుభూతికి చాలా ఆనందంగా ఉంది. మీ మాటలు నాకెంతో బలాన్ని ఇచ్చాయి” అని పవన్ కళ్యాణ్ తన ట్వీట్‌లో తెలిపారు. ఈ ట్వీట్ ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత కీలకంగా ఉందో చెప్పకనే చెపుతుంది.