Site icon HashtagU Telugu

Uniform Civil Code : పార్ల‌మెంట్లో చంద్ర‌బాబు, జ‌గ‌న్ భ‌విత‌వ్యం.!

Uniform Civil Code

Uniform Civil Code

ఏపీలోని ప్ర‌ధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వాల‌కం (Uniform Civil Code)పార్ల‌మెంట్ వేదిక‌గా బ‌య‌ట‌ప‌డ‌నుంది. వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టే ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు ఆ రెండు పార్టీల‌కు అగ్నిప‌రీక్ష‌. ముస్లిం లా బోర్డు ప్ర‌తినిధులు ఒకే రోజు అటు చంద్ర‌బాబు ఇటు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. ఆ బిల్లును పార్ల‌మెంట్ వేదిక‌గా వ్య‌తిరేకించాల‌ని కోరారు. ముస్లింల‌కు అన్యాయం జ‌రిగేలా ఉంటే వ్య‌తిరేకిస్తామ‌ని ఇంచుమించు ఒకేలా చంద్ర‌బాబు, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముస్లిం లా బోర్డు ప్ర‌తినిధుల‌కు హామీ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

పార్ల‌మెంట్ వేదిక‌గా వైసీపీ, టీడీపీ వాల‌కం (Uniform Civil Code)

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ముస్లిం ఓట్ల ప్ర‌భావాన్ని చూశాం. ఆ ఎన్నిక‌ల్లో సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీ వైపు ముస్లింలు మొగ్గారు. పైగా ఫ‌త్వా ఒకసారి ముస్లిం ప్ర‌తినిధులు ఇస్తే, దాని మీద ముస్లిం ఓట‌ర్లు క‌ట్టుబ‌డి ఉంటారు. ఎన్నిక‌ల ముందు ముస్లిం పెద్ద‌లు ఇచ్చే సంకేతాల మేర‌కు సాలిడ్ గా ఓట్లు వేసే ప‌రిస్థితి ఉంది. అందుకే, ఆ ఓట్ల కోసం రాజ‌కీయ పార్టీలు జాగ్ర‌త్త‌గా  (Uniform Civil Code) ప్లాన్ చేస్తుంటాయి. ఏపీకి వ‌స్తే, గ‌త ఎన్నిక‌ల్లో సాలిడ్ గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైపు ముస్లిం ఓట‌ర్లు నిలిచారు. కానీ, ఈసారి ప‌రిస్థితి మారింది.

ఏపీలో బీజేపీ, వైసీపీ క‌లిసి న‌డుస్తోన్న తీరును ముస్లింల‌కు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి అత్యంత స‌న్నిహితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మెలుగుతున్నారు. ఏపీలో బీజేపీ, వైసీపీల‌ను వేర్వేరుగా చూడ‌లేం. ఆ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని స‌గ‌టు ఏపీ పౌరులు ఎవ‌రైనా విశ్వ‌సిస్తారు. పైగా బీజేపీ పెద్ద‌ల‌కు తెలియ‌కుండా ఏమీ చేయ‌మ‌ని రెండేళ్ల క్రిత‌మే ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బాహాటంగా చెప్పారు. రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం ప్ర‌ధాని న‌రేంద్రమోడీతో ఉంద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల విశాఖ వ‌ద్ద జ‌రిగిన స‌మావేశంలో మోడీ సమ‌క్షంలోనే చెప్పారు. కేంద్రం నుంచి తాజాగా అందుతోన్న స‌హాయ‌, స‌హ‌కారాల‌ను గ‌మ‌నిస్తే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి చాలా ప్రాధాన్యం (Uniform Civil Code)మోడీ ఇస్తున్నార‌ని తెలిసిందే.

యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌లికే అవ‌కాశం (Uniform Civil Code)

ఏపీలో బీజేపీ, వైసీపీ క‌లిసి న‌డుస్తోన్న తీరును ముస్లింల‌కు తెలుసు. అందుకే, మునుప‌టి మాదిరిగా ఆ ఓట‌ర్లు ఇప్పుడు టీడీపీ వైపు మ‌ళ్లారు. ఫ‌లితంగా వైసీపీ ఓటు బ్యాంకు గ‌త ఎన్నిక‌ల కంటే ఇప్పుడు త‌గ్గింద‌ని అంచ‌నా. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో యూనిఫాం బిల్లుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ద్ధ‌తు ఇస్తే, ముస్లిం క‌మ్యూనిటీ హోల్ సేల్ గా వ్య‌తిరేకం కానుంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఆదేశం మేర‌కు లోక్ స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో బీజేపీకి మ‌ద్ధ‌తు వైసీపీ ఇవ్వ‌నుంద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని వినికిడి. అందుకే, ముస్లిం లా బోర్డు ప్ర‌తినిధులు క‌లిసిన సంద‌ర్భంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా చాక‌చ‌క్యంగా  (Uniform Civil Code)వ్య‌వ‌హ‌రించారు. ప‌ర్స‌న‌ల్ లా బోర్డుల నిర్ణ‌యం మేర‌కు యూనిఫాం సివిల్ కోడ్ ఉండాల‌ని స‌రికొత్త వాదాన్ని జ‌గ‌న్ అందుకున్నారు.

ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు పెట్టిన‌ప్పుడు ఆయా పార్టీలు వ్య‌వ‌హ‌రించే తీరు

లోక్ స‌భ‌లో ముగ్గురు, రాజ్య‌స‌భ‌లో ఒక్క‌రు మాత్ర‌మే ఎంపీ ఉన్న టీడీపీ మ‌ద్ద‌తును తీసుకోవ‌డానికి ముస్లిం లా బోర్డు ప్ర‌తినిధులు చంద్ర‌బాబును క‌లిశారు. ఆయ‌న 2018 నుంచి మోడీకి దూరంగా ఉంటున్నారు. అయితే, ఇటీవ‌ల ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాల‌ని చూస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల దృష్ట్యా ప్ర‌భుత్వ ఓటు బ్యాంకు చీలిపోకుండా బీజేపీతో పొత్తు అనే అంశాన్ని కూడా ప‌రిశీలిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌లికే అవ‌కాశం ఉంది. అందుకే, ఆ బిల్లులో ముస్లింల‌కు అన్యాయం జ‌రిగేలా నిబంధ‌న‌ల‌ను ఉంటే, వాటిపై పోరాడుతానంటూ హామీ ఇచ్చారు. ఇలా క‌ర్ర ఇర‌గ‌కుండా పాము చావుకుండా అన్న‌ట్టు యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు మ‌ద్ధ‌తు ప‌లికే అవ‌కాశం మీద వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Also Read : TDP Jumping Leaders : అమ‌రావ‌తి నేత‌ల పోటు!?

ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు పెట్టిన‌ప్పుడు ఆయా పార్టీలు వ్య‌వ‌హ‌రించే తీరు ఆధారంగా ఈసారి ఎన్నిక‌ల్లో ముస్లిం ఓటర్ల నాటి ఉంటుంది. రాయ‌ల‌సీమ‌, గుంటూరు జిల్లాల్లోని చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముస్లిం ఓట‌ర్లు గెలుపోట‌ముల‌ను నిర్దేశించ‌గ‌ల‌రు. అందుకే, సానుకూలంగా ముస్లిం లా బోర్డు ప్ర‌తినిధుల‌కు అనుకూలంగా స్పందించారు. కానీ, పార్ల‌మెంట్ వేదిక‌గా న‌రేంద్ర మోడీ వ్యవ‌హ‌రించే తీరు ఆధారంగా టీడీపీ, వైసీపీ  (Uniform Civil Code) భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.

Also Read : CBN Turning Point : చంద్ర‌బాబు`మ‌లుపు`కు 3డేస్