Site icon HashtagU Telugu

AP : చంద్రబాబు స్కిల్ కేసులో ఊహించని ట్విస్ట్

Undavalli Arun Kumar File Pill in High Court on Skill Scam Case

Undavalli Arun Kumar File Pill in High Court on Skill Scam Case

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం (Skill Scam Case)కు సంబదించిన పూర్తి విచారణ CBI తో జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) ఏపీ హైకోర్టు (AP High Court) లో పిటిషన్ దాఖలు చేసారు. ఇప్పటికే ఈ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా విచారణ జరుగుతుండగానే..తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మరో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చగా మారింది.

ఈ స్కాం మూడు రాష్ట్రాలకు విస్తరించిందని దీంతోపాటు ఇందులో ఆర్థిక నేరాలు, జీఎస్టీ ఎగవేత వంటి సమస్యలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసును దర్యాప్తు చేసి నలుగురిని అరెస్టు చేసిందని గుర్తు చేశారు. అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించడం సముచితమని ఆయన పిటిషన్లో స్పష్టం చేశారు. ఈ పిల్‌ను హైకోర్టు అంగీకరించిందని వచ్చే వారం విచారణ చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also : Chandrababu Remand : చంద్రబాబు కస్టడీ పిటిషన్ ఫై తీర్పు వాయిదా…

ఒకవేళ కోర్ట్ ఈ కేసును CBI కి అప్పగిస్తే..చంద్రబాబు కు మేలు జరగడంతోపాటు చెడు కూడా జరుగుతుందని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు(Chandrababu ) ఏపీ CID అధికారుల వేధింపుల నుంచి విముక్తి పొందుతాడు. అంతేకాదు ఒకవేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామని చెబితే వారు కూడా సాయం చేసే అవకాశం ఉంటుంది. అలాగే చంద్రబాబు మొదటిసారిగా సీబీఐ(CBI) విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో చంద్రబాబు సీబీఐ విచారణ ఎదుర్కొన్నారని దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటారు. అంతేకాదు ఈ కేసులో ఏదైనా బలమైన సాక్ష్యం దొరికితే చంద్రబాబు ఎక్కువ కాలం జైల్లోనే గడపాల్సి వస్తుంది. ఇలా ఈ కేసు సీబీఐ చేతికి వెళ్తే బాబు కు మంచి , చెడు రెండు ఉన్నాయని తెలుస్తుంది.