కాంగ్రెస్ (Congress) మళ్లీ దేశ వ్యాప్తంగా తన ఉనికిని చాటేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి రాష్ట్రం ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టి..ఆయా రాష్ట్రాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్లాలని చూస్తుంది. ఇప్పటికే తెలంగాణ లో విజయం సాధించి తన సత్తా చాటింది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బిజెపి , రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాంగ్రెస్ తెలంగాణ (Telangana) లో విజయం సాధించింది. ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..ఇప్పుడు వాటిని అమలు చేస్తూ..మిగతా రాష్ట్రాల ప్రజల ను ఆకట్టుకునే పనిలో పడింది.
We’re now on WhatsApp. Click to Join.
అలాగే ఏపీ (AP) లో కూడా తన ఉనికిని చాటేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా వైస్ షర్మిల ను పార్టీలోకి తీసుకున్న కాంగ్రెస్..ఇప్పుడు ఏపీ పగ్గాలు ఆమెకు అప్పజెప్పాలని చూస్తుంది. మరికొద్ది రోజుల్లో షర్మిల ఏపీలో బిజీ కాబోతుంది. ఈ తరుణంలో సీనియర్ రాజకీయనేత , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఫై కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇటీవల షర్మిల భర్త బ్రదర్ అనిల్.. ఉండవల్లి అరుణ్ కుమార్ (undavalli Arun Kumar) కలిశారు. తమ కుమారుడి పెళ్లికి రావాలని ఉండవల్లిని బ్రదర్ అనిల్ ఆహ్వానించారు. అనంతరం ఇరువురి మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఉండవల్లి కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యాయని.. మళ్లీ కాంగ్రెస్‌లో చేరే అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ పార్టీతో పోలిక లేకుండా.. కాంగ్రెస్‌లో అన్ని రకాల వ్యక్తులు ఉంటారు.. అదే ఆ పార్టీ బలం అని వ్యాఖ్యానించారు.
Read Also : Spiritual Tourism: అయోధ్యకు సంబంధించి అత్యధిక శోధనలు.. అమెరికా, గల్ఫ్ దేశాల నుండి ఆసక్తి..!