Site icon HashtagU Telugu

Jagan Tour : జగన్ ఖాతాలో ఇద్దరు బలి

Jagan Tour 2 Duies

Jagan Tour 2 Duies

పల్నాడు జిల్లా సత్తెనపల్లి (Sattenapalli) మండలంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) పర్యటన విషాదాన్ని మిగిల్చింది. భారీ కాన్వాయ్‌తో జరిపిన ఈ పర్యటనలో రెండు మృతిచెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉదయం ఏటుకూరు వద్ద కాన్వాయ్‌లోని వాహనం ఢీకొట్టగా వృద్ధుడు సింగయ్య మృతిచెందాడు. అలాగే సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద మరొక కార్యకర్త జయవర్దన్ రెడ్డి ఊపిరితిత్తుల సమస్యతో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

Drunken Drive : స్కూల్ బస్సు డ్రైవర్లపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. రెండు బస్సులు సీజ్

జగన్ రాకతో ఏర్పడిన గందరగోళం, కార్యకర్తల రద్దీ వల్ల క్లాక్‌టవర్ వద్ద తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. అదే సమయంలో ఉన్న జయవర్దన్ రెడ్డి అనూహ్యంగా కిందపడి, ఆసుపత్రికి తరలించేలోపే మరణించారని వైద్యులు తెలిపారు. అతను సత్తెనపల్లిలో ఆటోమొబైల్ షాపు నడుపుతూ, పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలాగే వృద్ధుడు సింగయ్యను ఢీకొట్టిన అనంతరం వైసీపీ నేతలు పట్టించుకోకుండా వెళ్లిపోయినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు వంద మందికే అనుమతి ఉందని హెచ్చరికలు చేసినప్పటికీ, వందలాది వాహనాలతో, వేలాది కార్యకర్తలతో భారీ బలప్రదర్శన చేసిన జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెంటపాళ్ల వెళ్లకముందే రెండు మృతులు సంభవించటం పార్టీ తీరుపై అనేక ప్రశ్నలను ఉత్పత్తి చేసింది. నియమాలు పాటించకపోవడం వల్లే ప్రాణనష్టాలు సంభవించాయని పల్నాడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.