Vallabhaneni Vamsi : వైసీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. వంశీపై భూకబ్జా, రైతులను మోసం చేసిన కేసులు చేశారు. మల్లపల్లి పారిశ్రామికవాడలో 128 మంది రైతులకు ప్రభుత్వ పరిహారం అందకుండా మోసం చేశారని కేసు నమోదు అయింది. అలాగే తెలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెట్టిల్మెంట్‌లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటు భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది. సీట్ ఏర్పాటు తరువాత నిన్న ఒక్క రోజే గన్నవరం నియోజకవర్గంలో వంశీ ఆయన అనుచరులుపై మొత్తం మూడు కేసులు నమోదు నమోదయ్యాయి. వంశీపై నమోదైన కేసుల అన్ని సీట్‌కు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
Read Also: CM Revanth Reddy : పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి
కాగా, మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడగించారు. వంశీతో పాటు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఉన్న నలుగురు నిందితులకు కూడా న్యాయమూర్తి రిమాండ్ పొడిగించారు. ఇక, గన్నవరం టీడీపీ ఆఫీసు పై దాడి కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులు రిమాండ్ లో ఉన్నారు. కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ కేసులో ఆయన అరెస్ట్ కాగా.. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు అతనిపై కొత్త కేసులు నమోదు చేస్తున్నారు.
ఇకపోతే.. మంగళవారం వంశీ మూడు రోజుల కస్టడీని రద్దు చేయాలని కోరుతూ కోర్టులో మెమో దాఖలైంది. నిందితుల తరఫు న్యాయవాది తానికొండ చిరంజీవి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానంలో ఆ మెమో దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల ప్రకారం నిందితులను విచారించే ప్రదేశం ముందుగా వారి తరఫున న్యాయవాదులకు తెలియజేయాలని, విచారణ సమయంలో మూడు నుంచి నాలుగుసార్లు నిందితులతో న్యాయవాదులు మాట్లాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ విషయాలను దర్యాప్తు అధికారులు తమకు తెలియజేయలేదని, అందువల్ల పోలీసు కస్టడీని రద్దు చేయాలని కోరారు.