Heavy Rains: తెలుగు రాష్ట్రాలలో నేడు, రేపు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన అధికారులు..!

శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున వారాంతంలో తెలుగు రాష్ట్రాల పౌరులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 09:35 AM IST

శని, ఆదివారాల్లో ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉన్నందున వారాంతంలో తెలుగు రాష్ట్రాల పౌరులు ఇళ్లలోనే ఉండాలని వాతావరణ శాఖ కోరింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, పగో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈరోజు, రేపు ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Also Read: Mega Textile Park : ఎట్టకేలకు తెలంగాణకు మెగా టెక్స్‌టైల్ పార్క్… ప్ర‌క‌టించిన ప్ర‌ధాని మోడీ 

తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని, వర్షాలకు ఇదే కారణమని వివరించారు. రానున్న రెండు రోజుల్లో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, చెదురుమదురుగా లేదా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ స‌మ‌యంలో పిడుగులు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలని అధికారులు సూచించారు.