అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day ) పురస్కరించుకొని 2025 జూన్ 20, 21 తేదీల్లో విశాఖపట్నం (Vizag) జిల్లాలోని అన్ని పాఠశాలలకు(Schools) రెండు రోజుల సెలవు (2 days Holidays) ప్రకటించారు. జిల్లా విద్యాశాఖ మరియు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సెలవు కేవలం ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగా కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనడానికే ప్రత్యేకంగా ఇవ్వబడిందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం పాఠశాలల సమయానికి విద్యార్థులు హాజరై యోగా ఆసనాలు చేసి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
విద్యార్థులలో యోగా పట్ల ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే నెల రోజులుగా జిల్లాలో సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లోనూ యోగా శిక్షణలు ప్రారంభమయ్యాయి. యోగాంధ్ర ఉద్యమంలో భాగంగా శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లు కూడా ఇవ్వనున్నారు. జూన్ 21న రామకృష్ణ బీచ్‌లో జరిగే ప్రధాన యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి శిక్షణ పొందిన విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు. ఇది విద్యార్థులకు మంచి గుర్తింపు పొందే అవకాశం కావడంతో చాలా మంది ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
పిల్లలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా ఎదగాలంటే యోగా ఒక ఉత్తమ మార్గమని అధికారులు పేర్కొంటున్నారు. విద్యా వ్యవస్థలో భాగంగా యోగాను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో స్థైర్యం, ఏకాగ్రత, సహనం వంటి గుణాలు పెంపొందుతాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అభినవ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరచడమే కాకుండా సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించనుంది.