Site icon HashtagU Telugu

TTD: హాట్‌ కేకుల్లా అమ్ముడైన టీటీడీ టికెట్స్, 20 నిమిషాల్లో 2.25 లక్షల ఆదాయం!

Ttd45

Ttd45

TTD: తిరుమల కొండపై నెలవైన వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరూ ఆసక్తి చూపుతుంటారు. అర నిమిషం పాటు దొరికే స్వామి వారి దర్శనం కోసం తహతహలాడుతుంటారు. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే రూపం. అందుకే భక్తులు కనీసం మూడు నెలల ముందే ఏడుకొండలవారిని దర్శించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంటా. అయితే ఈ నేపథ్యంలో టీటీడీ విడుదల చేసే టికెట్స్ హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి.

ఈ విషయం తాజాగా మరోసారి రుజువైంది. తిరుమల ఆలయ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు శుక్రవారం కేవలం 20 నిమిషాల వ్యవధిలో 2.25 లక్షల రూపాయలకు పైగా అమ్ముడయ్యాయని ఆలయ అధికారులు తెలిపారు. డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) టిక్కెట్లను విడుదల చేసింది.

ప్రత్యేక దర్శనం టిక్కెట్ల విక్రయంతో టీటీడీకి రూ.6,75,00,000 ఆదాయం సమకూరింది. నిన్న ఉదయం 11 గంటలకు శ్రీవాణి విరాళం, దర్శనం టిక్కెట్లను కూడా టీటీడీ విడుదల చేసింది.  డిసెంబరు 22న కొండ దిగువన తొమ్మిది వేర్వేరు ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ ద్వారా ఉచిత టోకెన్లను విడుదల చేయనున్నట్లు తెలియజేశారు. టికెట్ల రూపంలో శ్రీవారి ఆదాయం రోజురోజుకూ పెరుగుతోంది. కాగా తిరుచానూరులో జరుగుతున్న  బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీ పద్మావతి దేవి పెద్ద శేష వాహనంపై బద్రీ నారాయణునిగా భక్తులకు దర్శనమిచ్చారు.

Also Read: Rebels: ఎన్నికల పోరులో రెబల్స్ ఝలక్.. ప్రధాన పార్టీలకు ఓటమి స్ట్రోక్!

Exit mobile version