Bhagavad Gita – One Crore Students : భగవద్గీత సందేశాన్ని భావితరాలకు వ్యాప్తి చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో భగవద్గీతను రాయించి పుస్తకాలుగా ముద్రించి తెలుగు రాష్ట్రాల్లో కోటి మంది విద్యార్థులకు పంపిణీ చేస్తామని ప్రకటించింది. తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ భగవద్గీత ను ముద్రించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులకు అందించే ఆలోచన చేస్తామని టీటీడీ పేర్కొంది.
Also read : 8000 Jobs : అంగన్వాడీ కేంద్రాలలో 8వేల జాబ్స్.. త్వరలో నోటిఫికేషన్
చిన్న పిల్లల్లో మానవీయ విలువలు, భక్తి విశ్వాసాలను పెంపొందించేందుకు రామ కోటి తరహాలో గోవింద కోటి పేరుతో కొత్త కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. 25 సంవత్సరాల్లోపు వయస్సున్న వారు గోవింద కోటి రాస్తే.. దాన్ని రాసిన వారితో పాటు కుటుంబ సభ్యులకూ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణోత్సవాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళతామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి అనుమతి లభిస్తే తిరుమల నడక దారి వెంబడి ఫెన్సింగ్ నిర్మిస్తామని టీటీడీ (Bhagavad Gita – One Crore Students) స్పష్టంచేసింది.
Also read : 100 Items In Stomach : కడుపులో 100 వస్తువులు.. సర్జరీ చేసి తీసిన డాక్టర్స్