Site icon HashtagU Telugu

Tirupati Stampede : తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..!!

Ttd Eo Shyamala Rao About Tirupati Stampede Incident

Ttd Eo Shyamala Rao About Tirupati Stampede Incident

తిరుపతి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల్లో బుధవారం చోటుచేసుకున్న తొక్కిసలాట (Stampede ) ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందడం దురదృష్టకరమని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను తిరుపతి పద్మావతి వైద్య కళాశాలలో టీటీడీ ఈవో పరామర్శించారు. డీఎస్పీ గేట్లు తీయడం వల్లనే ఈ ఘటన జరిగిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఆయన చెప్పుకొచ్చారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన చికిత్స అందించేందుకు వైద్యులతో చర్చించారు.

E Car Race Scam : కేటీఆర్ ఇంటికా..? జైలుకా..? బిఆర్ఎస్ లో టెన్షన్

కొందరికి ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 41 మంది గాయపడ్డారని, అందులో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు ఈవో తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రాణాపాయం లేదని, అవసరమైన అన్ని వైద్యసేవలు అందిస్తున్నామని అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని , పూర్తి వివరాలు విచారణ పూర్తైన తర్వాత వెల్లడించనున్నట్లు చెప్పారు.

TTD : తిరుమల వైకుంఠద్వార దర్శనం టోకెన్ల జారీ పూర్తి

ఇక తొక్కిసలాట ఘటన లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేసియా అందించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట ఘటన క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. అనంతరం నష్టపరిహారాన్ని ప్రకటించారు.