Pawan Kalyan – BR Naidu : ఏపీలో డిప్యూటీ సీఎంగా, మంత్రిగా తన పరిధిలో ఉన్న శాఖలలో పాలనను పరుగులు పెట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్. వేరే శాఖల పనులపై కూడా స్పందిస్తున్నారు. ఇక ఇటీవలే టీటీడీ కొత్త పాలకమండలి బాధ్యతలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ గా TV5 అధినేత బిఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.
టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మొదటిసారి బిఆర్ నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. నిన్న సాయంత్రం బిఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో ఆయన్ను కలిశారు. పవన్ ఇటీవల హిందుత్వ వాదం, ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో టీటీడీలో మార్పులు చేర్పులు, తిరుమలలో హిందూ పవిత్రతను, ధర్మ సంరక్షణ వంటి అంశాలపై వీరి మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. టీటీడీ చైర్మన్ సపరేట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మీటింగ్ అవ్వడంతో చర్చగా మారింది.
Also Read : Satyadev : RRR సినిమాలో సత్యదేవ్.. ఎడిటింగ్ లో తీసేసిన రాజమౌళి..