తాజాగా నేడు తిరుమల(Tirumala)లో టీటీడి పాలక మండలి సమావేశం TTD ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి(YV Subba Reddy) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
టీటీడి పాలక మండలి సమావేశం తీసుకున్న నిర్ణయాలు ఇవే..
అదనపు లడ్డూ కౌంటర్ల నిర్మాణానికి 4.17 కోట్లతో టెండర్‌లకు ఆమోదం తెలిపారు.
2.35 కోట్లతో HVC కాటేజీలు ఆధునీకరణ ఆమోదం తెలిపారు.
తిరుమలలో 40.50 కోట్లతో వేస్ట్ మేనేజమెంట్ టెండర్లకు ఆమోదం తెలిపారు.
3.10 కోట్లతో తిరుమలలో డస్ట్ బిన్‌ల కోసం స్టీల్ సాండ్స్ ఏర్పాటు చేయనున్నారు.
టీటీడీ అంతటా కంప్యూటర్ల ఆధునీకణకు 7.44 కోట్లు కేటాయించారు.
టీటీడీ AD బిల్డింగ్ లో రికార్డు రూం నిర్మించనున్నారు.
తిరుపతి స్విమ్స్ ఆధునీకరణకు 1200 బెడ్స్ ఉండే విధంగా 97 కోట్లతో అవసరమైన భవనాలు నిర్మించాలని నిర్ణయించారు.
తిరుచానూరు పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు.
ఒంటిమిట్టలో 4 కోట్లతో అన్నదాన భవనం నిర్మించడానికి ఆమోదం తెలిపారు.
అలాగే ఇటీవల పలువురు రాజకీయ నాయకులు TTDపై, శ్రీవాణి ట్రస్ట్ పై ఆరోపణలు చేస్తున్నారు. నిధుల దుర్వినియోగం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ సమావేశంలో దీనిపై కూడా చర్చించారు. అనంతరం TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీపై రాజకీయ కారణాలతో కొందరు ఆరోపణలు చేస్తున్నారు. TTD, శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నాం. ఈ విషయంపై బోర్డులో సుదీర్ఘంగా చర్చించాము. రాష్ట్రంలోని 25 జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో 2445 ఆలయాలు నిర్మాణానికి నిధులు ఖర్చుపెడుతున్నాం. 200లకు పైగా పురాతన ఆలయాలు మరమ్మత్తులకు ఖర్చు చేస్తున్నాం. శ్రీవాణి ట్రస్ట్ విరాళాల ఖర్చుపై త్వరలోనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తాము. అలాగే శ్రీవాణి ట్రస్ట్ పై దుష్ప్రచారం చేసే నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
Also Read : RGV : సీఎం జగన్‌తో మరోసారి ఆర్జీవీ భేటీ.. ఆ సినిమా కోసమేనా?