Train Tickets Are Sold Out 4 Months Before Sankranti : సంక్రాంతి (Sankranti )..ఈ పండగా వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్ర ప్రజలకు సంతోషమే సంతోషం. ముఖ్యంగా ఏపీ లో ఈ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మకర సంక్రాంతి (Makara Sankranti ) , సంక్రాంతి (Sankranti ), కనుమ (Kanuma)..ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ పండగను కుటుంబ సభ్యులంతా కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ వస్తుందంటే చాలు ప్రపంచం లో ఎక్కడనున్న సరే తమ సొంతర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకునేందుకు ప్లాన్ చేసుకుంటుంటారు.
ఇందుకు గాను మూడు నెలల ముందే తమ ప్రయాణాలకు సంబంధించి ప్లాన్ చేసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతికి సొంతర్లకు వెళ్లే వారికీ ప్రయాణ ఇబ్బందులు తప్పేలా లేదు. 4 నెలల ముందే రైళ్లలోని టికెట్లన్నీ (Train Tickets Are Sold) అయిపోయాయి. గౌతమి, కోణార్క్, సింహపురి, గరీభ్రథ్, ఫలక్ నామ, గోదావరి, శబరి, LTT విశాఖ, ఈస్ట్ కాస్ట్, చార్మినార్, వందేభారత్ రైళ్లలో జనవరి 10, 11, 12 తేదీల్లో వెయిటింగ్ లిస్టు వందల్లో ఉంది. ఆ పరిమితి కూడా దాటి రిగ్రెట్ కనిపిస్తోంది.
జనవరి 11న ప్రయాణానికి విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీలో 341, జన్మభూమిలో 238, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 197 వెయిటింగ్ లిస్టు చూపిస్తోంది. జనవరి 10వ తేదీన ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 160, జన్మభూమిలో 100 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 12వ తేదీన రెండు వందేభారత్ రైళ్లలో 255 మంది వెయింటింగ్ లిస్టు ఉంది. ఈస్ట్‌కోస్ట్‌లో అన్ని తరగతుల్లో 221 మంది వెయిటింగ్‌లిస్టు జాబితాలో ఉన్నారు. పద్మావతి, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10-12 తేదీల్లో పెద్ద ఎత్తున వెయిటింగ్ లిస్టు ఉంది. సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లేవారికీ విశాఖ గరీబ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్, గోదావరి, చార్మినార్, సింహపురి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లలో రిజర్వేషన్ దొరకట్లేదు. కేవలం శాతవాహన, గుంటూరు ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్, గోల్కొండలలో మాత్రం 10, 11, 12 తేదీల్లో తక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రత్యేక రైళ్ల జాబితా విడుదల చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Read Also : Delhi Next CM: కేజ్రీవాల్‌తో మనీష్ సిసోడియా భేటీ, తదుపరి సీఎంపై కీలక నిర్ణయం