Vizianagaram : విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం

విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ ఢీకొట్టింది.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 09:19 PM IST

విజయనగరం (Vizianagaram) జిల్లాలో ఘోర రైలు (Train Accident) ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి (Alamanda To Kantakapalle) వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్రత్యేక ప్యాసింజర్ ట్రైన్ అలమండ-కోరుకొండ రైల్వే స్టేషన్ సమీపంలో సిగ్నల్ పడకపోవడంతో పట్టాలపై నిలిచి ఉంది. ఆ సమయంలో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును వెనుక నుంచి విశాఖ-రాయగడ స్పెషల్ ట్రైన్ (Vishakapatnam to Rayagada Special Train) ఢీకొట్టింది.

We’re now on WhatsApp. Click to Join.

రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు గ్రూపులో డీఆర్ఎం సౌరబ్ ప్రసాద్ సమాచారం ఇచ్చారు. పట్టాలు తప్పిన ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. సమాచారం అందడంతో ఇప్పటికే సహాయక బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నాయని డీఆర్ఎం తెలిపారు. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. పలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అంత భావిస్తున్నారు.

ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

Read Also : Rahul Gandhi :రాహుల్ ఎంత పనిచేసావ్ ..కాంగ్రెస్ నేతలు షాక్